E-Paper
Advertisement

“వయలెంట్ మ్యాన్” ప్రభాస్ కి ‘సలార్ 2’ టీమ్ స్పెషల్ బర్తడే విషెస్.. క్రేజీ అప్డేట్ వైరల్!

“వయలెంట్ మ్యాన్” ప్రభాస్ కి ‘సలార్ 2’ టీమ్ స్పెషల్ బర్తడే విషెస్.. క్రేజీ అప్డేట్ వైరల్!
Advertisement

Salaar 2: పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ (Prabhas ) పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఆయన నటిస్తున్న సినిమాల నుండి కూడా వరుస అప్డేట్లు సినిమా అభిమానులలో అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కల్కి 2 నుండి ఒక అప్డేట్ వచ్చి సినిమా పై ఊహించని బజ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఏకంగా సలార్ 2 టీం నుండి అదిరిపోయే స్పెషల్ విషెస్ లభించడం గమనార్హం.

వయలెంట్ మ్యాన్..

ఈ మేరకు చిత్ర బృందం ప్రభాస్ కి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ను “వయలెంట్ మ్యాన్” అంటూ అభివర్ణించిన మేకర్స్.. ఈ ప్రత్యేకమైన రోజున సలార్ 2: శౌర్యాంగ పర్వం మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సలార్ చిత్రానికి సీక్వెల్ గా ఈ ప్రాజెక్టు కోసం తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

డైనమిక్ ద్వయం కోసం తాము కూడా ఎదురుచూపు..

Advertisement

బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ డైనమిక్ ద్వయం ప్రభాస్ – ప్రశాంత్ నీల్ మరోసారి థియేటర్లలో తమ సత్తా చాటడానికి సిద్ధమవుతోందని చెప్పడంతో రెబల్ స్టార్ అభిమానులలో అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి. మొత్తానికైతే ఈ డైనమిక్ ద్వయం మళ్ళీ ఎప్పుడు తెరపైకి రాబోతోందో తెలియాల్సి ఉంది.

also read:ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. కల్కి 2 నుండి ఆకట్టుకుంటున్న అప్డేట్!

ప్రభాస్ కి స్పెషల్ విషెస్ తెలియజేసిన గోపీచంద్ ..

Advertisement

ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ (Gopichandh) తను స్నేహితుడు ప్రభాస్ కి పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ప్రభాస్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రభాస్.. జీవితం నిన్ను ఎంత దూరం తీసుకెళ్లినా నీ వ్యక్తిత్వమే నీకు ఎల్లప్పుడూ అతిపెద్ద బలం. హృదయపూర్వకంగా అదే అద్భుతమైన వ్యక్తిగా ఉంటూ.. నువ్వు ఇంత సాధించడం చూసి నిజంగా చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి ఆరోగ్యం, అంతులేని ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను” అంటూ గోపీచంద్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. గోపీచంద్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ప్రభాస్ కి ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Related News

రాజకీయాల వల్ల కోట్లు పోగొట్టుకున్న నటుడు?

ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. కల్కి 2 నుండి ఆకట్టుకుంటున్న అప్డేట్!

ప్రభాస్ కి జపాన్ ఆడియన్స్ స్పెషల్ సర్ప్రైజ్.. వీడియో వైరల్!

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత!

విజయ్ దేవరకొండకు ఇంకా ఎంత రావాలంటే.. రణబాలి లెక్క ఇదే!

వెంకీ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. రచ్చకు రెడీనా!

గ్లామర్ షోతో కాదు.. సింపుల్ లుక్‌తోనే మ్యాజిక్ చేసిన సాన్యా!

Big Stories

Advertisement
×