E-Paper
Advertisement

Actress Meena : కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు.. ఫైర్ అవుతున్న మీనా.. అసలేమైందంటే?

Actress Meena : కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు.. ఫైర్ అవుతున్న మీనా.. అసలేమైందంటే?
Advertisement

Actress Meena : అభినయ సుందరిగా తనకంటూ ఒక ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ మీనా(Meena ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు ఎంతో మంది స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అంతే వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.. ఇదిలా ఉండగా వ్యక్తిగతంగా మీనా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో కొంతకాలం పాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన మీనా.. ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో మీనా రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. ఒకవైపు తీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ రావడం ఆమెను మరింత కృంగదీసాయనే చెప్పాలి.

రెండో పెళ్లి రూమర్స్ పై స్పందించిన మీనా..

ఇకపోతే దయచేసి ఇటువంటి రూమర్స్ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్ పత్తా లేకుండా పోయాయి. అయితే కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే తంతు మొదలయ్యింది. ఏదో ఒక హీరోతో మీనాకు లింకు పెట్టడం.. త్వరలోనే రెండో పెళ్లి అంటూ ప్రచారం చేయడం.. మీనా అనే కాదు ఆమె అభిమానులను కూడా ఈ విషయం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇకపోతే ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తప్పుడు కథనాలు రాస్తే ఊరుకునేది లేదు..

Advertisement

వివాదాలకు దూరంగా ఉంటూ..తన పని తాను చేసుకుంటూ పోయే మీనా పై ఇలాంటి అసత్య ప్రచారాలు అటు సెలబ్రిటీలకు కూడా మింగుడు పడడం లేదు.. ఈ నేపథ్యంలోనే ఆమె స్వయంగా కల్పించుకొని ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ” నాకు రెండో పెళ్లి అని తప్పుడు కథనాలు రాస్తున్నారు. అందులో నిజం ఉంటే పర్వాలేదు..మీరు మాట్లాడుకోవడంలో తప్పు కూడా లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకొని కల్పించుకొని రాయడం ముమ్మాటికి తప్పే.. నేను ఒక ఒంటరి మహిళను. అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్లు సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నాకు ఒక కూతురు ఉంది.. తను ఇవన్నీ చూస్తే అసలు ఏమనుకుంటుంది? ఇదంతా నాకు ఎంత అసౌకర్యంగా ఉందో మీకు తెలుసా?

కర్మ ఎవరిని వదిలిపెట్టదు..

చాలా చిరాకు తెప్పిస్తోంది. దీనిని భరించడం నావల్ల కావడం లేదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా ఎనర్జీని, ఆరోగ్యాన్ని, నా సమయాన్ని కూడా నాశనం చేసుకోదలుచుకోలేదు నేను చాలా పాజిటివ్ వ్యక్తిని సంతోషంగా , పాజిటివ్ గా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. మంచి విషయాలపైనే ఫోకస్ పెడతాను. దయచేసి ఇంకోసారి ఇలాంటి తప్పుడు వార్తలను కథనాల రూపంలో వెలువరించకండి ” అంటూ మండిపడింది మీనా. మొత్తానికైతే ఇన్ని రోజులు సహనంగా, శాంతిశీలిగా కనిపించిన మీనాలో ఇంత ఆగ్రహం కట్టలు తెంచుకోవడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇకనైనా రూమర్స్ ఆపాలని మండిపడుతూ ఉండడం గమనార్హం.

Advertisement

ALSO READ; Actress Lesbian Roles: లెస్బియన్ గా రష్మిక కొత్త ప్రయోగం.. ఇప్పటివరకు అలా నటించిన హీరోయిన్స్ ఎవరెవరంటే ?

 

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×