E-Paper
Advertisement

ChinnaReddy: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో చిన్నారెడ్డి భేటీ

ChinnaReddy: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో చిన్నారెడ్డి భేటీ
Advertisement

ChinnaReddy: ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్ లో జరిగిన ఈ భేటీలో ఖర్గేకు పూల బొకే ఇచ్చి తెలంగాణ రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులను చిన్నారెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ 70 శాతం స్థానాలను, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని కొనసాగించిందని, రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో, ఇతర ఏ ఎన్నికలు వచ్చిన కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఖర్గేకు చిన్నారెడ్డి వివరించారు.

Also Read: Medak News: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 22 మంది విద్యార్థినులకు అస్వస్థత

రాజ్యసభ సభ్యునిగా అవకాశం

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు సమిష్టిగా చేస్తున్న కృషిని మల్లికార్జున్ ఖర్గే అభినందించారని చిన్నారెడ్డి తెలిపారు. రెండేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంను తాను వెనక్కి ఇచ్చే సమయంలో తనను రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీనిచ్చిన విషయాన్ని చిన్నారెడ్డి ఏఐసీసీ చీఫ్ ఖర్గే దృష్టికి తెచ్చారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఖర్గేను చిన్నారెడ్డి కోరారు.

Also Read: Komatireddy Venkat Reddy: బిగ్ టీవీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Related News

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

Big Stories

Advertisement
×