E-Paper
Advertisement

సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు.. ఆ 3 డోంట్ మిస్!

సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు.. ఆ 3 డోంట్ మిస్!
Advertisement

September Theatre Releases: సమ్మర్‌లో వాయిదా పడిన అనేక చిన్నాపెద్ద సినిమాలు వరుసపెట్టి బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో విభిన్నమైన చిత్రాలు అలరించగా, రాబోయే సెప్టెంబర్ నెలలో కూడా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా నాని నటించిన ‘ది పారడైజ్’, కార్తీ ‘సర్దార్ 2’, అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రాలు ఈ నెలలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న నాని ‘ది పారడైజ్’:

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరియు నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో వస్తున్న మైల్ స్టోన్ పాన్-ఇండియా చిత్రం ‘ది పారడైజ్’. 1980ల నాటి సికింద్రాబాద్ స్లమ్ నేపథ్యంలో సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో నాని సరసన సోనాలి కులకర్ణి కథానాయికగా నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా కార్తీ ‘సర్దార్ 2’:

Advertisement

కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కార్తీ హీరోగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’. ఎస్‌జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ అండ్ హై-వోల్టేజ్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. కార్తీ మార్క్ యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి ఛాయిస్.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’:

నవ్వుల రేడు అల్లరి నరేష్ హీరోగా చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మించిన ఈ సినిమాలో సురభి కథానాయికగా నటిస్తుండగా వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఇక చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున శ్రీరామ్ నటించిన మా రాముడు అందరివాడు, శ్వేతా లక్ష్మణ్, కుమార్ కాసారం జంటగా నటించిన సహా చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

సెప్టెంబర్‌లో రాబోతున్న ఇతర ప్రధాన చిత్రాలు:

Advertisement

ఈ మూడు పెద్ద సినిమాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాలు కూడా సెప్టెంబర్‌లో సందడి చేయనున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ ప్రభాస్ నటించిన ‘రోమాంచికం’, దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘ఐయామ్ గేమ్’ సెప్టెంబర్ 3న విడుదల కానున్నాయి.

ఇక అలాగే సుహాస్ నటించిన ‘మందాడి’, తమిళ హారర్ మూవీ ‘డెమోంటే కాలనీ 3’ సెప్టెంబర్ 10న, సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’, ఆనంద్ దేవరకొండ ఎపిక్ సెప్టెంబర్ 11న, సెప్టెంబర్ 18న నిహాల్, కీర్తి సురేష్ నటించిన ‘డోరతీ’, అరవింద్ నటించిన రూపాయనమః సెప్టెంబర్ 25న విడుదల కానున్నాయి. వీటితోపాటు మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు, ఇతర భాష చిత్రాలు కూడా ఈ సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతున్నాయి.

also read: రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్?

సెప్టెంబర్ నెల మూవీ లవర్స్‌కు నిజంగా వినోదాల పండుగలా మారబోతోంది. విభిన్నమైన జోనర్లతో వైవిధ్యభరితమైన కథలు థియేటర్లలోకి వస్తుండటం విశేషం. ముఖ్యంగా ‘ది పారడైజ్’, ‘సర్దార్ 2’, ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ఈ మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నందున వీటిని అస్సలు మిస్ అవ్వద్దు..

Related News

రేర్ పిక్.. గౌతమ్ కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపిన మహేష్ బాబు!

రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్?

త్వరలో వర్క్ మోడ్ లోకి రష్మిక..కానీ?

వంగీమామ ఇంత త్యాగం చేశారా..? విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

Big Stories

Advertisement
×