E-Paper
Advertisement

రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్?

రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్?
Advertisement

Actress Prema: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో.. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు చేసే కామెంట్లు కూడా వైరల్ అవుతూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ 70 ఏళ్లలో పెళ్లికి సిద్ధం అయినా తప్పేంటి ? అంటూ తనదైన శైలిలో స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది. తోడు కావాలనుకున్నప్పుడు దానికి వయస్సు పరిమితం కాదు అంటూ ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

రెండో పెళ్లికి సిద్ధమే అంటున్న ప్రముఖ నటి ప్రేమ..

ఆమె ఎవరో కాదు ప్రముఖ సినీ నటి ప్రేమ (Actress Prema) .. గత కొంతకాలంగా రెండో వివాహం చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు రాగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వార్తలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రేమ మాట్లాడుతూ..” పెళ్లి అనేది పూర్తిగా ఒక వ్యక్తిగత విషయం.. జీవితంలో సరైన తోడు దొరకడం కూడా చాలా ముఖ్యమే.. ముఖ్యంగా మనసుకు నచ్చిన వ్యక్తి, జీవితాంతం తోడుగా నిలిచే మంచి మనసున్న వ్యక్తి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటాను. ఇక పెళ్లి చేసుకోవడానికి వయసు అనేది ఒక అడ్డంకే కాదు. జీవితంలో తోడు కావాలనిపిస్తే 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చు.. అందులో ఏమాత్రం తప్పులేదు” అంటూ ప్రేమ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే రెండో పెళ్లికి సిద్ధమంటూ డైరెక్ట్ గానే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ప్రేమ మనసును దోచుకునే వ్యక్తి ఎవరో.. ఎక్కడున్నారో కాలమే నిర్ణయించాలి.

తెలుగు చిత్రాలతో భారీ పాపులారిటీ..

Advertisement

తెలుగు, కన్నడ ,తమిళ్, మలయాళం అంటూ వరుస చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ముఖ్యంగా ధర్మచక్రం, జగదేకవీరుడు, దేవి, కోరుకున్న ప్రియుడు, అత్త నీ కొడుకు జాగ్రత్త, ఓంకారం, రాఘవయ్య గారి అబ్బాయి, ఈతరం నెహ్రు , ఢీ, రాయలసీమ రామన్న చౌదరి వంటి ఎన్నో తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం చిత్రాలలో కూడా భారీ ప్రాజెక్టులలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చివరిగా 2024లో రజాకార్, ఉత్సవం , జ్యూయల్ థీఫ్ అంటూ పలు చిత్రాలు చేసింది. కానీ మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూలో దర్శనమిచ్చింది ప్రేమ. అందులో భాగంగానే తనపై వస్తున్న రూమర్లకు డైరెక్ట్ గానే స్పందించి, తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే కాకపోతే సరైన తోడు కావాలి అంటూ తెలిపింది.

also read: త్వరలో వర్క్ మోడ్ లోకి రష్మిక..కానీ?

ప్రేమ పెళ్లి , విడాకులు..

Advertisement

కెరియర్ పీక్స్ లో ఉండగానే.. 2006లో జీవన్ అప్పాచ్చు అనే వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ప్రారంభంలో ఎంతో సంతోషంగా సాగిన వీరి కాపురంలో కాలక్రమేనా తీవ్రమైన మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి.. 2016లో విడాకులు తీసుకొని అధికారికంగా విడిపోయారు.

Related News

సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు.. ఆ 3 డోంట్ మిస్!

త్వరలో వర్క్ మోడ్ లోకి రష్మిక..కానీ?

వంగీమామ ఇంత త్యాగం చేశారా..? విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

Big Stories

Advertisement
×