E-Paper
Advertisement

King film Release Date: క్రిస్మస్ ను టార్గెట్ చేసిన షారుఖ్ ఖాన్ ‘ కింగ్’..రిలీజ్ డేట్ ఫిక్స్!

King film Release Date: క్రిస్మస్ ను టార్గెట్ చేసిన షారుఖ్ ఖాన్ ‘ కింగ్’..రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement

King film Release Date:  బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు షారుఖ్ ఖాన్ (Sharukh Khan)ప్రస్తుతం కింగ్ సినిమా(King Movie)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్(Siddarth Anand) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్ వెల్లడించారు. ఈ సినిమా విడుదల తేదీని తెలియజేయడంతో షారుక్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో షారుక్ కుమార్తె సుహానా ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

డిసెంబర్ 24న విడుదల..

రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 24వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. షారుక్ ఖాన్ వెండి తెరపై సందడి చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పఠాన్ సినిమా..

Advertisement

షారుఖ్ ఖాన్ చివరిగా పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం షారుక్ ఖాన్ కమిట్ అయిన సినిమాలన్నీ కూడా షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కింగ్ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. అనీల్ కుమార్, రాణి ముఖర్జీ వంటి తదితరులు కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యారు. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.

సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్…

Advertisement

ఇక షారుక ఖాన్ సినిమాలంటే కేవలం నార్త్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో కూడా షారుఖ్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . గతంలో షారుఖ్ ఖాన్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. జవాన్ సినిమాతో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. ఇక త్వరలోనే కింగ్ సినిమా ద్వారా షారుక్ ఖాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Raviteja: రవితేజను ఢీ కొట్టబోతున్న ఎస్. జె సూర్య.. పక్కాగా ప్లాన్ చేసిన డైరెక్టర్?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×