E-Paper
Advertisement

శర్వానంద్’ బైకర్ ‘సెన్సార్ పూర్తి…కత్తెర పెట్టిన సెన్సార్ బోర్డు.. రన్ టైం ఎంతంటే!

శర్వానంద్’ బైకర్ ‘సెన్సార్ పూర్తి…కత్తెర పెట్టిన సెన్సార్ బోర్డు.. రన్ టైం ఎంతంటే!
Advertisement

Biker Film: టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఈ ఏడాదికి సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా మరో సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శర్వానంద్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో నటించిన చిత్రం బైకర్(Biker). ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

శర్వానంద్ బైకర్ రన్ టైం..

ఇలా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక తాజాగా సెన్సార్ బోర్డు ఈ సినిమా చూసి ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిందని తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా 2:42 నిమిషాల 30 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రేసింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో చిన్న చిన్న కట్స్ కూడా సెన్సార్ విధించారని తెలుస్తోంది.

బైకర్ పై సెన్సార్ కట్స్…

Advertisement

ఈ సినిమాలో 4 సన్నివేశాలకు సెన్సార్ కత్తెర పెట్టారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి డిస్క్లైమర్ తో పాటు కొన్ని అభ్యంతరకరమైన F*,B*పదాలను మ్యూట్ చేశారు. ఇలా 15 సెకండ్ల చిన్నచిన్న అభ్యంతరాలను కట్ చేస్తూ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇలా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో చిత్ర నిర్మాతలు విడుదల పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని యు.వి క్రియేషన్ బ్యానర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది.

ట్రైలర్ చూసి నమ్మేయాలి డ్యూడ్..

Advertisement

ఈ సినిమాలో శర్వానంద్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నారు. ఇక శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు రాజశేఖర్ నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) సైతం రంగంలోకి దిగారు. ఇటీవల ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశారు ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ ప్రభాస్ చేసిన ఈ వీడియో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పాలి. మరి ఏప్రిల్ 3న రాబోతున్న బైకర్ శర్వాకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: సెన్సార్ పూర్తి చేసుకున్న నిహారిక ‘రాకాస’ .. రన్ టైం ఎంతంటే?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×