E-Paper
Advertisement

HBD Sharwanand : శర్వానంద్ బర్తడే స్పెషల్.. అభిమానులకు డబుల్ ట్రీట్!

HBD Sharwanand : శర్వానంద్ బర్తడే స్పెషల్.. అభిమానులకు డబుల్ ట్రీట్!
Advertisement

HBD Sharwanand :టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand ) నేడు పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఆయన నటిస్తున్న రెండు విభిన్నమైన ప్రాజెక్టుల నుండి అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు మేకర్స్. ఒకటి రేసింగ్ నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘బైకర్’ కాగా, మరొకటి 1960ల కాలం నాటి పీరియాడిక్ డ్రామా ‘భోగి’. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలో శర్వానంద్ పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. మరి మనము ఆ వివరాలు చూద్దాం..

‘బైకర్’గా రేసింగ్ ట్రాక్‌పై శర్వా.. ఏప్రిల్ 3న విడుదల:

అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘బైకర్’. ఇందులో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటార్‌‌సైకిల్ రేసర్‌‌‌‌గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను డాల్బీ సినిమా, EPIQ, 4DX వంటి ప్రీమియం ఫార్మాట్స్‌లో ఏప్రిల్ 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ హీరో రాజశేఖర్ ‘బుల్లెట్ సునీల్’ అనే ఎక్స్ మోటోక్రాస్ లెజెండ్ పాత్రలో కనిపించడం విశేషం. ఇక జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త సౌండ్ మరియు విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది.

1960ల నాటి ‘భోగి’.. ఆగస్టు 28న పాన్ ఇండియా రిలీజ్:

Advertisement

శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘భోగి’ ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు. సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా 1960ల నాటి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం ఏకంగా 20 ఎకరాల్లో ఆరు నెలల పాటు శ్రమించి భారీ సెట్లను తీర్చిదిద్దారు. పక్కా ఊరమాస్ లుక్‌లో శర్వానంద్ కనిపిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ALSO READ:Trisha – Vijay: విజయ్ కి అండగా త్రిష.. టీవీకే తరఫున అక్కడి నుండి పోటీ?

ఫ్యాన్స్‌కు అసలైన బర్త్‌డే ట్రీట్:

Advertisement

సాధారణంగా ఒక సినిమా అప్‌డేట్ వస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు, అలాంటిది ఒకేరోజు రెండు భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ రావడంతో శర్వానంద్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఏప్రిల్‌లో రేసింగ్ బైక్‌పై స్పీడు చూపించబోతున్న శర్వా, ఆగస్టులో ‘భోగి’తో వింటేజ్ మాస్ లుక్‌లో పలకరించబోతున్నారు. ఇక డిఫరెంట్ జోనర్లను ఎంచుకోవడంలో శర్వానంద్ ఎప్పుడూ ముందుంటారని ఈ రెండు సినిమాలు మరోసారి నిరూపిస్తున్నాయి. ఈ ఏడాది శర్వానంద్ కెరీర్‌లో ఒక మెమరబుల్ ఇయర్ కావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×