E-Paper
Advertisement

Praja Palana Program: నేటి నుంచి సిటీలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

Praja Palana Program: నేటి నుంచి సిటీలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
Advertisement

Praja Palana Program: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కింద 99 రోజుల కార్యాచరణను కోర్ అర్బన్ రీజియన్ లో పక్కాగా అమలు చేసేందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలు మరింత సమర్థవంతంగా జరిగేందుకు వీలుగా ప్రభుత్వ జీఓను కూడా జారీ చేసింది. జూన్ 12 వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో వారానికో థీమ్ పై అధికారులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు తొలుత పారిశద్ద్యం పనులపై ప్రజలకు అవగాహన కల్పించేదుకు శానిటేషన్ థీమ్ ను ఎంచుకున్నారు.

బ‌మృకున్-ఉద్-దౌలా చెరువు

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదటి రోజు శుక్రవారం కోర్ అర్బన్ రీజియన్ లోని పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, పలు ప్రాంతాల్లో సందర్శించనున్నట్లు తెలిసింది. కనుమరుగవుతున్న చెరువులు, కుంటలను గుర్తించి, వాటిని పునరుద్దరించటంలో తలమునకలైన హైడ్రా పునరుద్దించిన బ‌మృకున్-ఉద్-దౌలా చెరువు ను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8 తేదీన ఆదివారం పాతబస్తీలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు 9వ తేదీ సోమవారం కూకట్ పల్లి నల్ల చెరువును కూడా ముఖ్యమంత్రి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రారంభించి, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన ఈ రెండు చెరువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Advertisement

Also Read: Steel Bottles: ప్లాస్టిక్ కంటే ప్రమాదకరమైన స్టీల్ బాటిల్స్ ఇవే.. తస్మాత్ జాగ్రత్త!

థీమ్‌ల వారీగా కార్యక్రమ వివరాలు

ప్రజాసమస్యల పరిష్కారం, స్థానిక అభివృద్దితో పాటు ప్రజల సమస్యలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పాట్‌‌లో పరిష్కరించేందుకు శుక్రవారం 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమలో వారానికో థీమ్ పై పాలకులు, అధికారులు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలను సిద్దం చేశారు. ఈ 99 రోజుల కార్యక్రమాన్ని 10 ప్రధాన థీమ్‌ల ఆధారంగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా మార్చి 6వ తేదీ నుంచి 15 వరకు పట్టణాభివృద్ది, పురపాలక, పంచాయతీ రాజ్, ఇతర శాఖల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 11వరకు ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక కార్యక్రమాలు, రవాణా, హోమ్ శాఖను కలుపుకుని రహదారి భద్రతపై ఏప్రిల్ 13 నుంచి 18 వరకు, అలాగే సంక్షేమ పథకాల అమలుపై ఏప్రిల్ 20 నుంచి 25 వరకు, పిల్లల భద్రత, డ్రగ్స్‌ కు నో కార్యక్రమాలను ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు నిర్వహించేలా ప్రణాళికలను సిద్దం చేశారు. రైతు సంబంధిత అంశాలపై మే 4 నుంచి 9వ తేదీ వరకు విద్యపై మే 11 నుంచి 16 వరకు, యువత, క్రీడలపై మే 18 నుంచి 23 వరకు, మహిళా సాధికారితపై మే 25 నుంచి 30 వరకు, పర్యావరణ పరిరక్షణపై జూన్ 1 నుంచి 12 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు కూడా ప్రజల మధ్యనే విధులు నిర్వర్తించనున్నారు.

Advertisement

Also Read: Maoist Son Letter: నాన్నా.. నిన్ను చూడాలని ఉంది అంటూ.. మావోయిస్టు కుమారుడి ఆడియో వైరల్..!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×