E-Paper
Advertisement

Virosh Reception: విరోష్ రిసెప్షన్.. స్పెషల్ అట్రాక్షన్ గా రష్మిక చెల్లి.. అప్పుడే అంత పెద్దదైపోయిందా?

Virosh Reception: విరోష్ రిసెప్షన్.. స్పెషల్ అట్రాక్షన్ గా రష్మిక చెల్లి.. అప్పుడే అంత పెద్దదైపోయిందా?
Advertisement

Virosh Reception:ఎట్టకేలకు తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఇక నిన్న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో అతిథులు సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ కూడా నిర్వహించారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వేడుకల్లో ఎంతోమంది సెలబ్రిటీలు అందరి దృష్టిని ఆకర్షించిన ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంది మాత్రం రష్మిక చెల్లి షిమాన్ మందన్న.

విరోష్ రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్ గా షిమాన్..

రష్మిక మందన్న ఎప్పుడూ కూడా తన సినిమాలతో బిజీ కారణంగా తన కుటుంబానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది అలాంటి ఈమెకు తనకంటే సుమారుగా 15 సంవత్సరాల చిన్నదైన చెల్లి ఉందని ఒకప్పుడు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది అంతేకాదు ఆ చిన్న చెల్లెలితో కలిసి దిగిన క్యూట్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కూడా ఇక అప్పటినుంచి మళ్ళీ రష్మిక తన చెల్లికి సంబంధించిన విషయాలను ఎక్కడ ప్రస్తావించలేదు. ఇక తనకు బిడ్డ పుడితే ఎలా చూసుకుంటానో తన చెల్లిని కూడా తన బిడ్డలాగే భావిస్తానని గతంలో పలుమార్లు చెప్పింది ఇక సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండడం వల్ల తన చెల్లితో గడిపే మధురమైన క్షణాలను తాను చాలా మిస్ అవుతున్నానని చెప్పి ఎమోషనల్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.

Advertisement

సందడి మొత్తం ఆమెదే..

ఆ తర్వాత ఎక్కడా కూడా షిమాన్ ప్రస్తావన తీసుకురాలేదు రష్మిక కానీ ఎట్టకేలకు రష్మిక పెళ్లి వేడుకల్లో షిమాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా తొలిసారి కెమెరా ముందు కనిపించడంతో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అప్పుడే అంత పెద్దది అయిపోయిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు చాలా అందంగా చక్కగా ఉండడమే కాకుండా విశ్వాసం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనికా సురేంద్రన్న గుర్తుచేస్తోంది అంటూ రష్మిక అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే మార్చి 4వ తేదీన హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ రిసెప్షన్ వేడుకల్లో మెగాస్టార్ ను మొదలుకొని మరి ఎంతోమంది సెలబ్రిటీలో రాజకీయ నాయకులు సందడి చేసిన అందరి దృష్టిని ఆకట్టుకుంది మాత్రం రష్మిక చెల్లి షిమాన్ అని చెప్పడంలో సందేహం లేదు ఇక ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Advertisement

ALSO READ:Dhurandhar 2: ధురంధర్ ఎఫెక్ట్.. దెబ్బకు వెనక్కి తగ్గిన మూవీస్.. లిస్ట్ వైరల్!

రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ప్రేమాయణం పెళ్లి..

గీతా గోవిందం సినిమాతో జంటగా ఇండస్ట్రీకి పరిచయమైన వీరు ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా చేసి మరోసారి తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో మ్యాజిక్ చేశారు ఇక తర్వాతే ప్రేమలో పడ్డ వీరిద్దరూ దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా తమ ప్రేమను కొనసాగించి ఎట్టకేలకు ఉదయపూర్ లో ఫిబ్రవరి 26 2026న డెస్టినేషన్ వివాహం చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పెళ్లి ఫోటోలతో పాటు రిసెప్షన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×