Shiva Re release: ప్రస్తుత కాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీల కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రాలుగా నిలిచిన ఎన్నో చిత్రాలు.. ఇప్పుడు మళ్లీ 4k వెర్షన్లో అధునాతన టెక్నాలజీతో విడుదలవుతూ.. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ అటు నిర్మాతలు కూడా లాభపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో కేవలం రూ.75 లక్షలతో తెరకెక్కి అప్పట్లోనే రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించిన శివ మూవీ ఈరోజు రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అటు ఆడియన్స్ తో పాటు ఇటు చిత్ర దర్శకుడు వర్మ చేసిన సందడి మామూలుగా లేదనే చెప్పాలి.
అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న దేవి 70mm, సుదర్శన్ థియేటర్ల వద్ద శివ రీ రిలీజ్ సందర్భంగా నాగార్జున అభిమానుల కోలాహలం భారీ ఎత్తున మొదలయ్యింది. డాన్సులు, నినాదాలతో అభిమానులు జోష్లో కనిపించారు. ఇకపోతే సుదర్శన్ థియేటర్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కూడా సందడి చేయడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయింది. ముఖ్యంగా శివ రీ రిలీజ్ రికార్డులు ఖాయమని అటు అభిమానులు కూడా భీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్మకి సంబంధించిన ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
శివ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తొలి పరిచయంలో నాగార్జున (Nagarjuna) ,అమల(Amala ) జంటగా వచ్చిన చిత్రం శివ. 1989 అక్టోబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమాకి తనికెళ్ల భరణి మాటలు అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ , ఎస్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై అక్కినేని వెంకట్ యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున, అమల, రఘువరన్ కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా అందించిన సంగీతం.. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి అందించిన సాహిత్యం సినిమాకి మరింత హైలెట్గా నిలిచాయి. బాలు, చిత్ర తమ అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
also read:Chef Mantra Project K S5: ఒకే ఏడాదిలో 2 సీజన్లు.. గ్లింప్స్ రిలీజ్.. ప్రీమియర్ ఎప్పుడంటే?
ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ చిత్రానికి అవార్డులు కూడా లభించాయి. ఉత్తమ దర్శకుడు విభాగంలో రాంగోపాల్ వర్మ నంది అవార్డు అందుకోగా.. ఉత్తమ నటుడు కేటగిరీలో నాగార్జున ఫిలిం ఫేర్ అవార్డును కూడా దక్కించుకున్నారు.
ఈ సినిమాలో శివ పాత్రలో నటించిన నాగార్జున.. తెలంగాణ యాసలో గణేష్ పాత్రకి విశ్వనాథ్.. మాఫియా డాన్ గా రఘువరన్.. డాన్ ముఖ్య సలహాదారు నానాజీగా తనికెళ్ల భరణి ఎంపిక పర్ఫెక్ట్ అనే చెప్పాలి. జేడీ పాత్ర చక్రవర్తికి స్థిరపడిపోయింది. ఎంతలా అంటే జెడి చక్రవర్తి అని చెబితే తప్ప ఎవరు ఊహించుకోలేనంత గుర్తింపు చక్రవర్తికి లభించింది.
ఒక మనిషిని శివ భుజాన వేసుకొని నేరుగా భవాని ఎదుటకు వెళ్లే సమయంలో నానాజీ భవాని చెవిలో ‘శివ అంటే వీడే’ అని చెప్పే డైలాగ్స్ కూడా అప్పట్లో బాగా ఆదరణ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఇందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుష్మ కూడా కష్టమైన సీన్స్ లో నటించి మెప్పించింది. అలా ఓవరాల్ గా ప్రేక్షకుడిని మెప్పించిన ఈ సినిమా నేడు రీ రిలీజ్ అయింది. మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
అక్కినేని నాగార్జున 'శివ' సినిమా రీరిలీజ్
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి 70 ఎంఎం, సుదర్శన్ థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం#Shiva #Nagarjuna #RGV #AmalaAkkineni #Rerelease #Tollywood #BIGTVCinema@iamnagarjuna@RGVzoomin pic.twitter.com/uYmZaUom9S
— BIG TV Cinema (@BigtvCinema) November 14, 2025