Shriya Saran: శ్రియ శరణ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బీచ్ ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. సముద్ర అలల మధ్య నిశ్చింతగా పడుకొని ఉన్న శ్రియ ఫోటో చూసినవాళ్లంతా ఆమె ఫిట్‌నెస్‌కి, కాన్ఫిడెన్స్‌కి ఫిదా అయ్యారు. 44 ఏళ్ల వయసులోనూ శ్రియ ఇంత ఫ్రెష్‌గా.. అందంగా కనిపించడం నిజంగా ప్రశంసనీయం.
ఈ ఫోటోలో శ్రియ తన హాలిడే మూడ్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. బీచ్, సూర్యకాంతి, సముద్రం… అన్నీ కలిసి ఒక అందమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఈ ఫోటోకు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా చాలా సింపుల్‌గా, హ్యాపీగా ఉంది. పిక్యూర్‌ట్రెయిల్‌కు అద్భుతమైన హాలిడే అందించినందుకు ధన్యవాదాలు చెప్పారు. అలాగే హాల్సియన్ ప్రైవేట్ ఐల్స్ మాల్దీవ్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సన్, బీచ్, హ్యాపీ టైమ్స్ మిస్ అవుతున్నానని కూడా శ్రియ చెప్పింది. తాను వేసుకున్న డ్రెస్‌కు ఫ్లర్టేషియస్ ఇండియాకు కూడా ధన్యవాదాలు తెలిపింది.
శ్రియ శరణ్ ఎప్పుడూ తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లే జీవించాలని నమ్మే వ్యక్తి. ఆమె ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించారు. హిందీ మాట్లాడే సాధారణ కుటుంబంలో పెరిగారు. ఆమె తండ్రి ఇంజనీర్ కాగా, తల్లి స్కూల్ టీచర్‌గా పని చేశారు. చిన్న వయసులోనే డిల్లీకి వెళ్లి కథక్ డాన్స్ నేర్చుకోవడం ఆమె జీవితంలో పెద్ద మలుపు.
కేవలం 17 ఏళ్ల వయసులోనే శ్రియ నటిగా కెరీర్ ప్రారంభించారు. అది ఆమె కుటుంబానికి కూడా ఆశ్చర్యమే. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ వంటి ఎన్నో భాషల్లో సినిమాలు చేశారు. కెరీర్ మొదట్లో చాలామంది ఆమెను “సౌత్ హీరోయిన్” అని పిలిచేవారు. కానీ ఆ ట్యాగ్ తనను ఎప్పుడూ పరిమితం చేయలేదని శ్రియ చెబుతారు.
మనల్ని మనం ఎలా నమ్ముకుంటామో, అలా మన జీవితం మారుతుందని ఆమె గట్టిగా నమ్ముతుంది. కొత్త భాషలు నేర్చుకోవడం, కొత్త సంస్కృతులతో పనిచేయడం తన జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దిందని శ్రియ ఎన్నోసార్లు చెప్పింది. మొదట్లో తెలుగు, తమిళ్ రాకపోయినా, కష్టపడి నేర్చుకుని ఇండస్ట్రీలో గౌరవం సంపాదించారు.
దక్షిణాది ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ తన జీవితంలో చాలా ప్రత్యేకమని శ్రియ భావిస్తారు. తన హృదయం సౌత్ ఇండియాదే అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ప్రేమే తన కెరీర్‌ను ఇంతకాలం ముందుకు నడిపిందని ఆమె నమ్మకం.
2026లో శ్రియ మరో కొత్త అడుగు వేసింది. హిందీ వెబ్ సిరీస్ ‘స్పేస్ జెన్: చంద్రయాన్’తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో ఆమె ఒక ఇస్రో శాస్త్రవేత్త పాత్రలో కనిపించారు. ఈ పాత్ర ద్వారా ఆమెలోని మరో కోణం ప్రేక్షకులకు తెలిసింది.
ALSO READ: Tamannaah Bhatia: మితిమీరిన రొమాంటిక్ సీన్లపై తమన్నా షాకింగ్ కామెంట్స్.. వాళ్లు మారాలట!