E-Paper
Advertisement

Divvela Madhuri:దువ్వాడ బయోపిక్ సినిమాపై మాధురి కామెంట్స్.. ఆ పాత్రలో చేయాలనుందంటూ!

Divvela Madhuri:దువ్వాడ బయోపిక్ సినిమాపై మాధురి కామెంట్స్.. ఆ పాత్రలో చేయాలనుందంటూ!
Advertisement

Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు . రాజకీయ నాయకుడిగా దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) అందరికీ ఎంతో సుపరిచితమే. అయితే ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన తన భార్యను దూరం పెట్టి దివ్వెల మాధురి(Divvala Madhuri)తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ తెలియజేశారు. ఇక ఇటీవల కాలంలో వీరిద్దరూ జంటగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట సినిమాల గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్..

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీనివాస్ గారికి ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు ఎదురైనప్పుడు మాధురి సమాధానం చెబుతూ.. శ్రీను గారి కాలేజీ డేస్ నుంచి అన్ని విషయాలను తాను తెలుసుకున్నాను ఆయనకి ఎక్కడ ఎలాంటి లవ్ స్టోరీలు లేవని తెలిపారు. ఇలా తన గురించి పూర్తిగా అన్ని విషయాలను తెలుసుకోవడంతో శ్రీనివాస్ గారి గురించి ఏదైనా బయోపిక్ సినిమా చేస్తారా ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు మాధురి సమాధానం చెబుతూ నిజానికి శ్రీను గారి బయోపిక్(Duvvada Srinivas Biopic) సినిమా గురించి ఇప్పటికే చాలామంది మమ్మల్ని కలిశారని తెలియజేశారు.

విలన్ పాత్రలు చేయటం ఇష్టం..

Advertisement

ప్రస్తుతం తాము కొత్త బిజినెస్ లను నిర్వహిస్తున్నాము ఈ బిజినెస్ పనులు అలాగే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉన్నాయి వీటి కారణంగానే తాము ఈ బయోపిక్ సినిమాపై ఆసక్తి చూపలేదని కానీ ఖచ్చితంగా బయోపిక్ సినిమా చేస్తామంటూ మాధురి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక మాధురి తన గురించి మాట్లాడుతూ తనకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. తను కనుక సినిమాలలో నటిస్తే ఖచ్చితంగా విలన్ పాత్రలలో నటించాలని కోరుకుంటున్నాను అంటూ తన మనసులో కోరికను కూడా బయటపెట్టారు.

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ గా మాధురి..

Advertisement

బయోపిక్ సినిమా గురించి మాట్లాడటంతో నిజంగానే ఈ సినిమా రాబోతోందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల మాధురి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈమె ఫైర్ స్ట్రోమ్ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇలా రెండు వారాలపాటు హౌస్ లో కొనసాగిన మాధురి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ ద్వారా కూడా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె సినిమాలలో అవకాశమొస్తే విలన్ గా నటిస్తానంటూ చెప్పటం విశేషం. మరి మాధురికి సినిమాలలో విలన్ గా ఎవరైనా అవకాశం కల్పిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈమె హైదరాబాదులో వకుల సిల్క్స్ అంటూ చీరల బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా పలు వ్యాపారాలను చూసుకుంటూ మాధురి ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Band Melam Glimpse: మగాడికి తాళి కట్టడం ఏంట్రా? ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్‌లో షాకింగ్ సీన్

Related News

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×