E-Paper
Advertisement

Shruti Haasan: అది మా నాన్న వల్లే… శ్రుతి హాసన్ బోల్డ్ స్టేట్‌మెంట్ వైరల్!

Shruti Haasan: అది మా నాన్న వల్లే… శ్రుతి హాసన్ బోల్డ్ స్టేట్‌మెంట్ వైరల్!
Advertisement

Shruti Haasan: టాలీవుడ్‌లో ‘నెపోటిజం’ (వారసత్వం) అనే పదం వినిపిస్తే చాలు.. చాలా మంది స్టార్ కిడ్స్ ఒళ్ళు విరుచుకుంటారు. “మేము కూడా కష్టపడ్డాం, మాకూ స్ట్రగుల్స్ ఉన్నాయి” అంటూ క్లాసులు పీకుతుంటారు. కానీ, లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్ మాత్రం రూట్ మార్చింది. తన గురించి ఎవరైనా ‘నెపో’ అనే పదం వాడితే తాను అస్సలు ఫీలవ్వనని, పైగా దాన్ని గర్వంగా ఒప్పేసుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇళయరాజా ఛాన్స్ ఇచ్చింది అందుకే!
తాజా ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ తన కెరీర్ ఆరంభం గురించి పచ్చి నిజాలు మాట్లాడేసింది. తన తండ్రి కమల్ హాసన్ సినిమాలో, అది కూడా దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా దగ్గర పాట పాడే అవకాశం రావడం వెనుక తన ‘వారసత్వమే’ కారణమని పరోక్షంగా ఒప్పుకుంది. “మా ఇంటికి ఇళయరాజా గారు వచ్చినప్పుడు నేను గట్టిగా అరిచాను.. నా వాయిస్ బాగుందని ఆయన మా నాన్న సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇది చెప్పడానికి సులభంగానే ఉంటుంది కానీ, బయట ఉన్న టాలెంటెడ్ సింగర్స్‌కి ఇంత ఈజీగా ఛాన్స్ రాదు కదా!” అంటూ నెపోటిజం పవర్ ఏంటో చెప్పకనే చెప్పింది. అందుకే ఎవరైనా తనను ‘నెపో కిడ్’ అంటే తాను అస్సలు వ్యతిరేకించనని కుండబద్దలు కొట్టింది.

Advertisement

రజనీ, కమల్.. సలహాలు అడగను కానీ!
కెరీర్ విషయంలో తన తండ్రి కమల్ హాసన్ లేదా సూపర్ స్టార్ రజనీకాంత్‌లను ఎప్పుడూ సలహాలు అడగలేదని శ్రుతి చెప్పుకొచ్చింది. అయితే వారిద్దరూ ‘పని రాక్షసులు’ అని, పనిని ప్రేమిస్తూనే ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో వారిని చూసి నేర్చుకున్నానని తెలిపింది. ఒక పక్కన సినిమాలతో బిజీగా ఉంటూనే, తన తండ్రి ఇన్‌స్టాగ్రామ్‌లో వంటల రీల్స్, చిన్న పిల్లల వీడియోలు పంపిస్తూ అచ్చం ‘సాధారణ తండ్రి’లాగే ఉంటారని సీక్రెట్స్ బయటపెట్టింది.

నెటిజన్ల కౌంటర్లు: “ఒప్పేసుకున్నందుకు థాంక్స్ శ్రుతి!”
సాధారణంగా వారసత్వం గురించి మాట్లాడితే నెటిజన్లు ఫైర్ అవుతుంటారు. కానీ శ్రుతి హాసన్ ఇలా ఓపెన్‌గా “అవును.. నేను నెపో కిడ్ నే” అని స్టేట్‌మెంట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. “అమ్మడు ఇన్నాళ్ళకి నిజం చెప్పింది” అని కొందరు అంటుంటే.. “మిగిలిన స్టార్ కిడ్స్ కూడా శ్రుతిని చూసి నేర్చుకోవాలి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో పాటు అనన్య పాండేతో కలిసి ‘కాల్ మీ బే’ సీజన్ 2లో నటిస్తున్న శ్రుతి.. తన హాట్ కామెంట్స్‌తో బాక్సాఫీస్ కంటే ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ ‘నెపో’ ట్యాగ్ శ్రుతి కెరీర్‌కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి!

Advertisement

also read :Tollywood Boxoffice: ఉస్తాద్ కూడా ముంచేశాడు! శ్రీరాముడైనా టాలీవుడ్ బాక్సాఫీస్‌ని కాపాడతాడా?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×