E-Paper
Advertisement

Plane Crash: విమానం ప్రమాదం.. రన్‌వే‌పై ఫైర్ ట్రక్కుని ఢీ కొట్టింది, ఒక్కసారిగా ప్రయాణికుల్లో

Plane Crash: విమానం ప్రమాదం.. రన్‌వే‌పై ఫైర్ ట్రక్కుని ఢీ కొట్టింది, ఒక్కసారిగా ప్రయాణికుల్లో
Advertisement

Plane Crash: అమెరికాలో మరొక విమానం ప్రమాదానికి గురైంది. న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్టులో టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న సమయంలో విమానం అదుపు తప్పింది. ఫలితంగా రన్‌వే పక్కన నిలిపి ఉన్న ఫైర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

అమెరికా ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం

Advertisement

కెనడాలోని మాంట్రియల్ నుండి ఓ విమానం న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఆ విమానం రన్ వే‌పై ఫైర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం.. విమానాశ్రయంలోని రన్‌వే 4పై ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ CRJ-900 విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదం సమయంలో విమానంలో 71 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో నలుగురు సిబ్బంది ఉన్నారు. ఫైర్ ట్రక్కును ఢీ కొట్టగానే వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ ద్వారా గుండా ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. విమానానికి సంబంధించి ముక్కు భాగం బాగా డ్యామేజ్ అయ్యింది.

Advertisement

రన్‌వే‌పై ఫైర్ ట్రక్కుని ఢీ కొట్టిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్

ప్రయాణికులకు గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఫైర్ ట్రక్కులో సిబ్బందికి గాయాలయ్యాయి. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 11.40 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడినవారు అగ్నిమాపక సిబ్బంది పోర్ట్ అథారిటీ పోలీస్ విభాగానికి చెందినవారు.

ఘటన తర్వాత విమానాశ్రయాన్ని మూసి వేసినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. విమానానికి ఏమీ కాలేదని చెబుతున్నప్పటికీ, ఆన్‌లైన్‌ ప్రచారంలో విమానం ముక్కు భాగం స్పష్టంగా దెబ్బతిన్నట్లు ఉంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం ట్రక్కు ఢీకొట్టడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. ట్రక్కు డ్రైవర్‌తో ఆగు, ఆగు, ఆగు అని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని క్షణాలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అక్కడి ఎయిర్ పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ALSO READ: ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. ఇక్కడి ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలియదు!

 

 

 

Related News

ఐఫోన్ 18 డ్యూయోనా? యూరప్ ట్రిప్పా? రూ.4.5 లక్షలతో ఈ దేశాలు హ్యాపీగా చుట్టేయొచ్చు!

ఢిల్లీలో రైళ్లకు బ్రేక్.. ఏకంగా 110 సర్వీసులపై ఎఫెక్ట్.. కారణం ఏంటంటే?

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!

నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×