Shruti Haasan: సౌత్ ఇండియన్ హీరోయిన్ శ్రుతి హాసన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ జీవితం గురించి కొన్ని సరదా విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తన తండ్రి గురించి అలానే.. సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి కమల్ హాసన్‌తో ఉన్న అనుబంధాన్ని ఎంతో సింపుల్‌గా వివరించింది. ప్రపంచానికి ఆయన ఒక లెజెండరీ నటుడు అయినప్పటికీ, తనకు మాత్రం సాధారణ నాన్నలాగే ఉంటారని ఆమె చెప్పింది.
తమిళ సూపర్ స్టార్స్.. రజినీకాంత్, కమల్ హాసన్ గురించి మాట్లాడిన శ్రుతి, వారిద్దరిలో ఒకే లక్షణం ఉందని చెప్పింది. అదేమిటంటే ఇద్దరిలో కూడా పని రాక్షసత్వం ఉందని. ఇద్దరు చాలా కష్టపడి పనిచేస్తారని..ఎంత కష్టపడినా, ఎప్పుడూ బయటకు చెప్పుకోరని, తమ పని పట్ల చాలా నిబద్ధతతో ఉంటారని తెలిపింది. పని విషయానికి వస్తే వారు ఎంతో శ్రమిస్తారని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక తన తండ్రి.. తను.. సినిమా విషయాల కంటే రోజువారీ జీవితం, చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుకోవడం ఎక్కువగా జరుగుతుందని చెప్పింది. ఈ సింపుల్ బాండింగ్ వల్లే తమ మధ్య మంచి అర్థం పెరిగిందని తెలిపింది.
అంతేకాకుండా తనకు కమల్ హాసన్ తరచూ ఫన్నీ వీడియోలు, రీల్స్ తనకు పంపుతుంటారని తెలిపింది. వాటిలో కొన్ని చాలా నవ్వు తెప్పిస్తాయని, మరికొన్ని మాత్రం అంతగా ఫన్నీగా అనిపించవని సరదాగా చెప్పింది.
“కొన్ని వీడియోలు చూస్తే ‘ఇది ఏమిటి నాన్నా.. నవ్వేలా లేదు’ అని చెప్తాను. కానీ ఆయన పంపే ఆర్ట్ వీడియోలు, కుకింగ్ వీడియోలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి,” అని శ్రుతి నవ్వుతూ చెప్పింది. చిన్నపిల్లల వీడియోలు పంపుతూ తనను గుర్తు చేసుకుంటారని, అది చాలా క్యూట్‌గా అనిపిస్తుందని తెలిపింది.
ప్రస్తుతం శ్రుతి హాసన్ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన కొత్త ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. మొత్తానికి, శ్రుతి చెప్పిన ఈ సరదా విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: Shruti Haasan: అది మా నాన్న వల్లే… శ్రుతి హాసన్ బోల్డ్ స్టేట్‌మెంట్ వైరల్!