E-Paper
Advertisement

HBD Simbu: ప్రేమాయణం లిస్ట్ పెద్దదే.. మరి పెళ్లి సంగతేంటి ?

HBD Simbu: ప్రేమాయణం లిస్ట్ పెద్దదే.. మరి పెళ్లి సంగతేంటి ?
Advertisement

HBD Simbu:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Simbu)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఈయన అసలు పేరు సిలంబరసన్ టీఆర్. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన పుట్టినరోజు ఈరోజు.. ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ఎలా అయితే పేరు దక్కించుకున్నారో.. అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో శింబు కూడా అలాగే పేరు దక్కించుకున్నారు.. నిజానికి ప్రభాస్ ఒకరిద్దరితో ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వినిపించినా.. ఇక్కడ శింబు మాత్రం చాలా మంది హీరోయిన్లతో ఫైర్ కొనసాగించారనే వార్తలు ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ ఎఫైర్ రూమర్స్ ని శింబు తండ్రి కూడా హన్సిక విషయంలో అంగీకరించిన విషయం తెలిసిందే.

బ్యాచిలర్ లైఫ్ ను వీడేదెన్నడు?

ఇకపోతే ఈరోజు శింబు 42వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో మొదటిగా శింబు ప్రేమాయణం

హార్ట్ టాపిక్ గా మారిన శింబు ఎఫైర్ లిస్ట్..

Advertisement

2006లో ‘వల్లవన్’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రముఖ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara)తో ప్రేమలో పడ్డారు. అదే సమయంలో డేటింగ్ కూడా చేశారు. కానీ కొన్ని ప్రైవేట్ ఫోటోలు లీక్ అవడంతో వారి సంబంధం కాస్త బహిరంగంగా ధృవీకరించబడింది. అయితే కొన్నాళ్లకు వీరిద్దరూ విడిపోయారు. అటు నయనతార ప్రభుదేవాతో రిలేషన్ కొనసాగించి.. అతడికి బ్రేకప్ చెప్పేసి డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసి.. ఇద్దరు మగ కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ప్రస్తుతం తన కుటుంబంతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

హన్సికతో ప్రేమాయణం..

అయితే శింబు మాత్రం ఆ తర్వాత కాలంలో ‘వాలు’ అనే సినిమా సమయంలో హన్సిక మోత్వానీ తో ప్రేమలో పడ్డారు 2014 సమయంలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ కొంత కాలానికి ఇద్దరు విడిపోయారు. హన్సిక తన స్నేహితురాలి మాజీ భర్త సోహెల్ కతూరియా తో 2022లో ఏడడుగులు వేసింది.

Advertisement

ALSO READ:Bhumika: ఆ బడా ఇంటి మేనకోడలి వల్లే హీరోయిన్ అయ్యా.. భూమిక కామెంట్స్!

త్రిష తో కూడా ఎఫైర్ రూమర్స్..

ఆ తరువాత ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తో కూడా ఈయన ఎఫైర్ నడిపించాడనే రూమర్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కానీ వీరిద్దరూ ఎక్కడా కూడా తమ బంధాన్ని ధ్రువీకరించలేదు. ఆ తర్వాత త్రిష కృష్ణన్ విజయ్ దళపతితో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి. కానీ అవి కూడా ఊహాగానాలు గానే మిగిలిపోయాయి. ఇక త్రిష మధ్యలో ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుంది. కానీ దానిని కూడా బ్రేకప్ చేసుకుంది.

వీరిని కూడా వదలలేదా?

దీనికి తోడు ప్రముఖ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) తో కూడా ఈయన రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) పేరు కూడా తెరపై వినిపించింది. దీనికి తోడు ఇటీవల నిధి అగర్వాల్ (Niddhi agerwal) తో కూడా ఈయన రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చినా ఎక్కడ ఇవి నిజం కాలేదు.

ఇప్పటికైనా శుభవార్త చెబుతారా?

ఇక ఇప్పుడు 42 సంవత్సరాలు పూర్తయినా.. కనీసం ఇప్పటికైనా వివాహం చేసుకుంటారని అభిమానులు ఆసక్తిగా చూపిస్తున్నారు.. మరి చూద్దాం ఈ కొత్త ఏడాదైనా శింబు వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారేమో.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×