E-Paper
Advertisement

Singer Chinmayi : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్..

Singer Chinmayi : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్..
Advertisement

Singer Chinmayi : ప్రముఖ సింగర్ చిన్మయి గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలతో పాటుగా.. తనకు సంబంధం లేని విషయాలలో కూడా ఆమె కలగజేసుకోవడంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల మహిళల వస్త్రధారణ పై శివాజీ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో ట్రోల్స్ ఎదురయ్యాయి. ఇదిలా ఉండగా  తాజాగా చిరంజీవి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై ఆమె స్పందించింది. తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అసలు చిన్మయి పోస్ట్ లో ఏముందోఇప్పుడు వివరంగా ఒకసారి తెలుసుకుందాం..

చిరంజీవికి చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. 

మన శంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు.. అయితే ఆ వీడియో వైరల్ అవ్వడంతో సింగర్ చిన్మయి దానిపై స్పందించింది.. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది.. ఫిల్మ్ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలతో విభేదించింది చిన్మయి. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరు. చిరంజీవి జనరేషన్లో ఎలా ఉండేదో తెలుసు.. మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు. లిరిసిస్ట్ వైరముత్తు నన్ను వేధించాడు. అసలు వేధించమని నేనడగలేదు. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకుంటారు అంటూ ట్విట్ చేసింది.. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.. చిరంజీవి మంచి ఉద్దేశంతోనే చెప్పారు మీరు తప్పుగా తీసుకుంటున్నారు అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారు చూడాలి..

క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన చిరు.. 

Advertisement

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చిరంజీవి సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు భారీ విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.. ఈ ఈవెంట్ లో సినిమా గురించి మాట్లాడిన అనంతరం చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.. ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఆడబిడ్డలైన మగ బిడ్డలైన ఎంకరేజ్ చేయాలి అప్పుడు అప్పుడే వాళ్ళలోని టాలెంట్ బయటపడుతుంది అని చిరంజీవి అన్నారు. ఇక్కడ నేను రాణించలేను, ఇక్కడ నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి, ఇక్కడ బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ జరిగాయి అంటే.. అది నీ తప్పిదం అవుతుంది. నువ్వు స్ట్రిక్ట్‌గా ఉండి.. సీరియస్ గా ఉండి నీ పని నువ్వు చేసుకుంటే ఎవరు అడ్వాంటేజ్ తీసుకోరు అని చిరంజీవి అన్నారు. మనం ఎలా ఉంటామో ఇండస్ట్రీ కూడా మనకు అలాంటి రిజల్ట్ ఇస్తుంది. నీ వ్యక్తిత్వం, అప్రోచ్, హార్డ్ వర్క్ బాగుంటే అంతా బాగుంటుంది. క్యాస్టింగ్ కౌచ్ అలాంటివేం ఉండవు. మీ బిహేవియర్ బట్టి ఉంటుంది. నీకుండే అభద్రతా భావంతో ఏమో అలా ఇలా ఉండాలేమో అని ఉండకూడదు.. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఒక దృఢ నిర్ణయంతో వస్తే మంచి సక్సెస్ ని అందుకుంటారు అన్న ఉద్దేశంతో చిరంజీవి మాట్లాడారు. ఆయన క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో సింగర్ చిన్మయి స్పందించరు.. చిరంజీవి వ్యాఖ్యలపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి…

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×