E-Paper
Advertisement

ICC: ఐసీసీ యాక్ష‌న్ షురూ..రోడ్డున ప‌డ్డ‌ బంగ్లాదేశ్ జ‌ర్న‌లిస్టులు..ఇండియాలో కాలు పెట్ట‌కుండా

ICC:  ఐసీసీ యాక్ష‌న్ షురూ..రోడ్డున ప‌డ్డ‌ బంగ్లాదేశ్ జ‌ర్న‌లిస్టులు..ఇండియాలో కాలు పెట్ట‌కుండా
Advertisement

ICC:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) ఆడకుండా హ్యాండ్ ఇచ్చిన బంగ్లాదేశ్ కు చుక్కలు చూపించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC ) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాకు బంగ్లాదేశ్ జర్నలిస్టులు ( Bangladeshi journalists ) ఎవరు కూడా రాకుండా ఆదేశాలు ఇచ్చింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఆడకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ దేశ జర్నలిస్టులకు షాక్ ఇచ్చింది ఐసీసీ. క్రికెటర్లకే భద్రత లేనప్పుడు మీ జర్నలిస్టులు వెళ్లి ఏం చేస్తారు ? అంటూ వాళ్ళ అప్లికేషన్లు రిజెక్ట్ చేసిందట ఐసీసీ.

బంగ్లాదేశ్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన ఐసీసీ

ఐసిసి టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కవరేజ్ కోసం బంగ్లాదేశ్ జర్నలిస్టులు ఇండియాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మొత్తం 150 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులు, రెడీ అయ్యారట. ఇందులో భాగంగానే ఐసీసీ రూల్స్ ప్రకారం అక్రిడేషన్లకు కూడా అప్లై చేసుకున్నారు. అయితే అంత లోపే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు బంగ్లాదేశ్ వెల్లడించింది.

Advertisement

ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చింది ఐసీసీ. ఇండియాలో పర్యటించేందుకు అప్లై చేసుకున్న 150 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టుల అక్రిడేషన్లను రిజెక్ట్ చేసిందట ఐసిసి. దీంతో కవరేజ్ చేయాలనుకున్న బంగ్లాదేశ్ జర్నలిస్టుల ఆశలు ఆవిరి అయిపోయాయి. ఇదొక్కటే కాదు ప్రతి విషయంలో కూడా ఐసీసీ అభ్యంతరం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్ధాంతరంగా బంగ్లాదేశ్ వైదొలగడంతో చాలా సీరియస్ గా ఉంది ICC. అటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఆర్థిక మూలాలపై కూడా దెబ్బ కొట్టే ప్రమాదం కూడా ఉంది. ఐసీసీ బాస్ జై షా ఆదేశాల మేరకు ఈ దిశగా అడుగులు పడుతున్నాయట.

బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్

టి నుండి ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026)  నుంచి అర్ధాంతరంగా బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో ఐసిసి కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ఇచ్చినా కూడా బంగ్లాదేశ్ తప్పుకోవడంతో మరో జట్టును తీసుకుంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ను ర్యాంకింగ్స్ ప్రకారం సెలెక్ట్ చేసింది ఐసీసీ. బంగ్లాదేశ్ స్థానంలో 21వ జట్టుగా స్కాట్లాండ్ బరిలోకి దిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో తాము ఆడేది కష్టమే అంటూ పాకిస్తాన్ కొత్త డ్రామాలు ఆడుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ కూడా సమావేశమయ్యారు. ఈ శుక్రవారం లేదా వచ్చే సోమవారం రోజున టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో తమ జట్టు ఆడేది ? లేనిది ? చెబుతామంటూ మొహ్సీన్ న‌ఖ్వీ వెల్లడించారు. దీంతో పాకిస్తాన్ ఆడేది డౌట్ గా మారింది. అయితే, పాకిస్తాన్ ఆడ‌క‌పోతే, క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది ఐసీసీ (ICC).

Advertisement

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×