E-Paper
Advertisement

ఆ నవ్వు వెనుక తీరని విషాదం.. సింగర్ చిత్ర ఎమోషనల్ పోస్ట్!

ఆ నవ్వు వెనుక తీరని విషాదం.. సింగర్ చిత్ర ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Singer Chitra: చిత్ర సీమలో తన అద్భుతమైన స్వరంతో ఎంతోమంది శ్రోతలను అలరించి.. ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న కేఎస్ చిత్ర గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎస్పీ బాలసుబ్రమణ్యం , ఇళయరాజా, యేసుదాసు , ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దిగ్గజాలతో కలసి పనిచేసిన ఈమె తన అద్భుతమైన గాత్రంతో వేలాది పాటలను అందించి.. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక పేజీని లిఖించుకుంది.. అయితే ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతులేని విషాదం దాగుంది. ఆ విషాదం వెనుక ఉంది ఆమె గారాలపట్టి నందన.

కనిపించే నవ్వు వెనుక.. కనిపించని దుఃఖం ఎంతో..

గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న చిత్ర విజయ్ శంకర్ అనే ఒక ఇంజనీర్ ను వివాహం చేసుకుంది. వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత 2002 డిసెంబర్ 18న నందన అనే అమ్మాయి వీరికి జన్మించింది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత పాప జన్మించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అయితే కూతురు పుట్టిందనే ఆనందం క్షణం కూడా లేదు కారణం పాపకి డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉండడం.. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే మనిషిలో అసలు ఎదుగుదల ఉండదు . నందనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అంటే 2011లో ఒక కచేరిలో పాల్గొనడానికి చిత్ర దుబాయ్ కి వెళ్ళింది. అక్కడ బస చేసిన ఒక హోటల్లో స్విమ్మింగ్ పూల్ ఉండగా ..ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటూ అందులోనే పడి కన్ను మూసింది నందన. నందన మరణం ఆమె జీవితాన్ని ముక్కలు చేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత పుట్టిన కూతురు పైగా అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఆ చిన్నారి అలా నీటిలో పడి చనిపోవడంతో చిత్ర జీర్ణించుకోలేకపోయింది.

కూతురి మరణం.. చిత్ర ఎమోషనల్ పోస్ట్..

Advertisement

ఆ బాధ నుండీ ఇప్పటికీ తేరుకోలేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈరోజు నందన మరణించిన రోజు (వర్ధంతి) . ఈ సందర్భంగా తన కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకుంది చిత్ర. “కూతురు లేని లోటు ఎప్పటికీ తీరదు. తన జ్ఞాపకాలు గుండెల్లో నిరంతరం ఉంటాయి ” అంటూ కూతుర్ని తలుచుకొని కన్నీటి పర్యంతమైంది. ఇక చిత్ర తన కూతురి వర్ధంతి సందర్భంగా షేర్ చేసిన ఈ పోస్ట్ చూసి అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఈ కష్టాన్ని ఎవరూ పూడ్చలేరని.. నీకు నీవే ధైర్యం చెప్పుకోవాలి తల్లి అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చిత్రకు సంబంధించిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిత్ర కెరియర్..

చిత్ర కెరియర్ విషయానికి వస్తే.. తెలుగు తమిళంలోనే కాకుండా అరబిక్, ఇంగ్లీష్, లాటిన్, మలాయ్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల్లో కూడా ఎన్నో పాటలు పాడింది . అలా సుమారుగా 25 వేలకు పైగా పాటలు పాడిన ఈమె.. తన అద్భుతమైన గాత్రంతో అందరినీ అలరిస్తోంది. కానీ ఆమె జీవితం మాత్రం విషాదమయం అనడంలో సందేహం లేదు. చిత్ర ఆ బాధ నుండి బయట పడాలని అభిమానులు ఎప్పటికప్పుడు కోరుకుంటున్నా చిత్రా మాత్రం ఈ నరకం కట్టె కాలే వరకు అనుభవించాల్సిందే అంటూ చెబుతూ ఉంటారు.

Advertisement

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×