E-Paper
Advertisement

మీ ఇంటి ఆడబిడ్డను ఇలాగే ఏడిపిస్తారా.. సింగర్ మంగ్లీ ఎమోషనల్!

మీ ఇంటి ఆడబిడ్డను ఇలాగే ఏడిపిస్తారా.. సింగర్ మంగ్లీ ఎమోషనల్!
Advertisement

Singer Mangli: జానపద గేయాలతో ఉనికిని చాటుకొని ఆ తర్వాత సినిమా పాటలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli).గత నాలుగు రోజులుగా మైక్రో ఫైనాన్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సుబ్బారావు అనే న్యాయవాది మంగ్లీ పైన కేసు వేయడం ,అటు మంగ్లీ తిరిగి ఆ న్యాయవాదిపై కేసు పెట్టడం అన్నీ సంచలనంగా మారాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన వ్యక్తిగా ఉన్న మధు ఇప్పుడు అప్రూవర్ గా మారారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మైక్రో ఫైనాన్స్ కేసుకి మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదు. హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు ..కంపెనీలో పెట్టిన సుమారుగా 20 కోట్లను ఆయనే తీసుకున్నాడు. అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి ఇద్దరూ కూడా స్నేహితులు అంటూ కుండబద్దలు కొట్టారు.

తప్పు చేస్తే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే – మంగ్లీ

మరోవైపు ఈ విషయంపై మంగ్లీ మాట్లాడుతూ.. మీడియా ముందు మరోసారి కన్నీటి పర్యంతం అయింది. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచి ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎవరికైనా అమ్మానాన్నలే కదా అతిపెద్ద ఎమోషన్. కానీ మీడియాలో, టీవీలో ఈ కేసుకు సంబంధించి నా ఫోటోలు చూసిన ప్రతిసారి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి కదా ..మీడియాలో చూపే విధానాన్ని బట్టే ప్రజలు కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నన్ను ఇలా తప్పుగా చూపించడం వల్ల అటు సోషల్ మీడియాకి వచ్చే లాభం ఏంటి ? దయచేసి ఈ వివాదంలో నా ఫోటోలను వాడకండి. నేను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే స్వయంగా నేనే జైలుకు వెళ్తాను. నేను ఏ తప్పు చేయలేదు. అందరికీ నిజాలు తెలిసినా.. అసత్యాలు ప్రచారం చేయడం వల్ల మా కుటుంబం మానసికంగా వేదన అనుభవిస్తోంది మీ ఇంటి ఆడబిడ్డను కూడా ఇలాగే ఏడిపిస్తారా ? నేను కూడా మీ ఇంటి ఆడబిడ్డ నే కదా.. దయచేసి నిజా నిజాలు తెలియకుండా తప్పుడు ప్రచారాలు చెయ్యకండి అంటూ కన్నీటి పర్యంతం అయింది మంగ్లీ. ప్రస్తుతం మంగ్లీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ప్రమేయం లేకుండానే ఆమెను ఈ కేసులో ఇరికించారనే వార్తలు ఇప్పుడు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి.. ఏది ఏమైనా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మధు నోరు విప్పడంతోనే అసలు నిజాలు బయటకు వచ్చాయి.

పాటలు పాడడమే వచ్చు.. స్కాములు చేయడం తెలియదు..

Advertisement

ఇదే మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. “నేను మానసికంగా ఎంతో కుమిలిపోతున్నాను . ఎక్కడ ఏం జరిగిందో అంతా విచారణ చేసుకోండి ..నాకు పాటలే ప్రపంచం. ఇది తప్ప ఏమీ తెలియదు.. ప్రజలారా.. సామాజిక మాధ్యమాలలో ప్రసారమయ్యే వాటిని ఎవరు కూడా నమ్మకండి .. ముఖ్యంగా కొందరు పెట్టే కామెంట్లు చూసి కుమిలిపోతున్నాను. నా వల్ల అసలు కావడం లేదు
నాకు పాటలు పాడడమే వచ్చు.. ఇలా స్కాములు చేయడం తెలియదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మంగ్లీ.

ALSO READ: OG 2: పవన్ కళ్యాణ్ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. అంతమంది హీరోలా?

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×