నంద్యాల జిల్లా నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ నియామక ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా ఎంపిక కమిటీ ఛైర్మన్ హోదాలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనుండగా వీటిలో 7 మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలు అలాగే 101 అంగన్‌వాడీ ఆయాల (సహాయకులు) ఖాళీలు ఉన్నాయి. అర్హత గల వివాహిత స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం కలిగి ఉండటంతో పాటు వివాహితులై ఉండటం ప్రాథమిక నిబంధనగా పేర్కొన్నారు.
వయస్సు: అభ్యర్థుల వయోపరిమితి 01.07.2025 నాటికి 21 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ మారుమూల ప్రాంతాల్లో 21 ఏళ్ల అభ్యర్థులు లభ్యం కాని పక్షంలో 18 ఏళ్లు నిండిన వారిని సైతం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
దరఖాస్తు ప్రక్రియ: ఏప్రిల్ 14న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలపై స్వయంగా సంతకం (Self Attestation) చేయాలి.
చివరి తేది: పూర్తి చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువు లోగా సంబంధిత సీడీపీవో (CDPO) కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి ఏప్రిల్ 23 సాయంత్రం 5:00 గంటల వరకు గడువు నిర్ణయించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు ప్రాజెక్టుల పరిధిలో గ్రామ – వార్డు సచివాలయాల స్థాయిలో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులకు పోటీ పడేవారు ఆయా గ్రామానికి చెందిన వారై ఉండాలి. క్షేత్రస్థాయిలో మహిళా శిశు సంక్షేమ శాఖ సేవలను బలోపేతం చేసే క్రమంలో ఈ నియామకాలు అత్యంత కీలకం కానున్నాయి.
గడువు ముగిసే వరకు చూడొద్దు..
అభ్యర్థులు ఇతర వివరాల కోసం తమ పరిధిలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన మహిళలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://nandyal.ap.gov.in/
ALSO READ: ఐటీఐ, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. అప్లై చేస్తే చాలు భయ్యా, పూర్తి వివరాలివే