E-Paper
Advertisement

Skn: మేము సినిమా తీసింది అందుకు, మీరు చున్నీలు తియ్యకండి

Skn: మేము సినిమా తీసింది అందుకు, మీరు చున్నీలు తియ్యకండి
Advertisement

Skn: నటుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన రాహుల్ రవీంద్రన్ కొంతకాలం తర్వాత చి ల సౌ సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమా తర్వాత నాగార్జున హీరోగా మన్మధుడు అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. పలు విమర్శలు కూడా అప్పుడు రాహుల్ పైన మొదలయ్యాయి.

రీసెంట్గా రష్మిక ప్రధాన పాత్రలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా తీశాడు రాహుల్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా లేడీస్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పలు రకాలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఈ సినిమా సీన్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి.

మీరు చున్నీలు తీయకండి 

Advertisement

ఈ సినిమాకి సంబంధించి పలు థియేటర్ ను విజిట్ చేశారు రాహుల్ రవీంద్రన్. అయితే ఒక థియేటర్లో ఒక ఉమెన్ వచ్చి రాహుల్ రవీంద్రన్ తో సినిమా గురించి విపరీతంగా ఎక్సైట్ అయి మాట్లాడింది.

మేమంతా కూడా రష్మిక ఫ్యాన్స్ తను వేసుకున్న విధంగానే డ్రెస్సులు వేసుకొని సినిమాకి వచ్చాము. కానీ సినిమా అయిపోయిన తర్వాత నేను ఈ చున్నిను తీసి ధైర్యంగా చెప్తున్నాను సమాజాన్ని ఇలానే ఫేస్ చేస్తాను అని ఎమోషనల్ అవుతూ చెప్పింది.

Advertisement

అయితే ఆ అమ్మాయి చున్నీ తీయటం అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పటికీ కూడా ట్విట్టర్ వేదికగా చాలామంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు. దీనిపైన నిర్మాత ఎస్ కే ఎన్ స్పందించి మీరు చున్నీలు తీయకండి అని చెప్పారు.

ఎస్ కే ఎన్ ఏం చెప్పారు 

ఈవెంట్ అయిపోతున్న తరుణంలో ఎస్ కే ఎన్ మాట్లాడుతూ ఇంకా అయిపోలేదు, బంగారు తల్లులు మీరు భయాన్ని జయించాలి అనే ఉద్దేశంతో సినిమా తీశాము. అంతే తప్ప మీరు ఎక్కడపడితే అక్కడ చున్నీలు తీయకండి. గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందుకు వచ్చి చాలామంది చున్నీలు తీస్తున్నారు. కొంతమంది షాపింగ్ మాల్స్ వాళ్ళు వచ్చి మా సేల్స్ పడిపోయాయి. అంటూ కంప్లైంట్ చేస్తున్నారు అని సెటైర్ వేశాడు ఎస్కేఎన్.

Also Read: SKN On Bandla : పేరు తీయకుండానే రెచ్చిపోయిన ఎస్కేఎన్, బండ్ల రియాక్షన్ ఏంటో?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×