Vijay Devarakonda : రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి మంచి హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ సినిమాని విపరీతంగా అమ్మాయిలు ఆదరిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నేడు ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే రష్మిక గురించి మాట్లాడారు విజయ్. అయితే ఇలా మాట్లాడుతున్న సందర్భాల్లో విజయ్ మాట్లాడిన మాటలు కొంతమేరకు ఎవరికో వార్నింగ్ ఇచ్చినట్లు కూడా అనిపించాయి.
విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను ఈరోజు చూశాను. నాకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా రోహిణి మేడం పర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమెతో నేను గతంలో కూడా కొన్ని సినిమాల్లో నటించాను. అంటూ చెప్పాడు విజయ్.
ముఖ్యంగా భూమా అనే క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. రష్మిక గురించి మాట్లాడాలి అంటే రియల్ లైఫ్ లో కూడా భూమా లాగే ఉంటుంది. చాలా ఇన్నోసెంట్. గీత గోవిందం అప్పుడు ఒక చిన్న పిల్లల ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు కూడా తను అందరి గురించి ఆలోచించేది. సెట్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇలా అందరి గురించి ఆలోచిస్తూ ఉండేది. అంటూ చెప్పారు.
మామూలుగా నాకు ఎవరైనా ఒక మాట అంటే నేను వెంటనే వాళ్లకు ఎదురు తిరుగుతా, కానీ రష్మిక అలా కాదు అన్ని విషయాలు కూడా బాగా ఆలోచిస్తుంది అంటూ చెప్పాడు విజయ్. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
Also Read: SKN On Bandla : పేరు తీయకుండానే రెచ్చిపోయిన ఎస్కేఎన్, బండ్ల రియాక్షన్ ఏంటో?