E-Paper
Advertisement

సమంతతో విడాకులు తన తప్పులేదు..నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!

సమంతతో విడాకులు తన తప్పులేదు..నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నటుడు నాగచైతన్య (Nagachaitanya) ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చైతన్య పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకొని వారి వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.నాగచైతన్య ముందుగా నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 7 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకొని విడిపోయారు.

సమంతతో నాగచైతన్య విడాకులు..

Advertisement

సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడంతో వీరి విడాకులకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయం నుంచి బయటపడిన నాగచైతన్య తన జీవితంలో మరో అడుగు ముందుకు వేస్తూ మరొక నటి శోభిత(Sobhita)ను ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతోమంది శోభితపై ఎన్నో కామెంట్లు చేశారు. శోభిత కారణంగానే సమంత నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయని వారి విడిపోయారు అంటూ శోభిత గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు..

శోభిత గురించి నెగిటివ్ గా మాట్లాడారు..

ఇలా శోభిత గురించి ఎన్నో కామెంట్లు వచ్చినప్పటికీ శోభిత మాత్రం ఎక్కడా ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నా విడాకులు విషయంలో శోభిత ప్రమేయం ఉందని తన కారణంగానే ఇవన్నీ జరిగాయి అంటూ సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు. వీటన్నింటిని చూస్తే చాలా బాధేస్తుందని అయితే శోభితకు ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు.

Advertisement

శోభిత ఓపికగా భరించింది…

శోభిత ఇంస్టాగ్రామ్ ద్వారా నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అలా ప్రేమగా మరి పెళ్లి వరకు కారణమైంది అంతకుముందు తనతో నేనెప్పడూ కలిసిన సందర్భాలు లేవని నాగచైతన్య తెలిపారు. ఏదో ఇంస్టాగ్రామ్ లో నాచురల్ గా కలిసామని ఈయన తెలిపారు. తన ప్రమేయం లేకపోయినప్పటికీ తన గురించి ఇలా ఎన్నో విమర్శలు వచ్చినా శోభిత మాత్రం చాలా ఓపికగా వాటిని భరిస్తుంది. ఆ విషయంలో శోభిత చాలా గ్రేట్ అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకున్న ఏడాదికి సమంత కూడా దర్శకుడు రాజ్ ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని విడిపోయి తిరిగి వారిద్దరూ వారి జీవితంలో మరో అడుగు ముందుకు వేస్తూ ఇద్దరు కూడా ప్రస్తుతం వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా వారి కెరియర్ పరంగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

AAlso Read:వృషకర్మ రిలీజ్ అయ్యేది అప్పుడే..హింట్ ఇచ్చిన నాగచైతన్య..

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×