E-Paper
Advertisement

కలిసి బతకలేక, విడిపోవడమూ చేతకాక నలిగిపోతున్న జంట… విడాకులతో కన్నీళ్లు పెట్టించే కథ

కలిసి బతకలేక, విడిపోవడమూ చేతకాక నలిగిపోతున్న జంట… విడాకులతో కన్నీళ్లు పెట్టించే కథ
Advertisement

Legal Drama OTT: చాలా మంది పెళ్లైన కొత్తలో నువ్వు లేకపోతే నేను లేనని తెగ మాటలు అల్లేస్తారు. అయితే విడిపోయే టైమ్ వచ్చేసరికి ఒకరి మీద ఒకరు ఎంతలా బురద చల్లుకుంటారో మాటల్లో చెప్పలేం. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూస్తే ఔరా అనక మానరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. విడాకుల నేపథ్యంలో సినిమా చాలా ఎమోషనల్ గా సాగుతుంది. ఇక్కడ ఎవరి వైపు చూసినా వాళ్ళు కరెక్టే అనిపిస్తుంది, కానీ ఇద్దరి మధ్య బంధం మాత్రం ముక్కలైపోతుంటుంది. ఇది విడాకుల గురించి తీసిన సినిమా అయినా, ఒక బంధాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడాలో కూడా మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మన పక్కింట్లోనో లేక మన ఇంట్లోనే ఏదో గొడవ జరుగుతుంటే గోడ చాటు నుంచి చూస్తున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా లాయర్లు ఎంటర్ అయ్యాక, ఒక అందమైన కాపురాన్ని ఎలా రచ్చకీడుస్తారో చూస్తే అమ్మ బాబోయ్, విడాకులు ఇంత దారుణంగా ఉంటాయా! అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి కచ్చితంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్ ను కూడా సొంతం చేసుకుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

నోవా బాంబచ్ దర్శకత్వం వహించిన ఈ హృదయ విదారకమైన లీగల్ డ్రామా పేరు ‘మ్యారేజ్ స్టోరీ’ (Marriage Story). ఇందులో ఆడమ్ డ్రైవర్, స్కార్లెట్ జోహాన్సన్ తమ నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. సినిమా దర్శకుడు నోవా బాంబచ్ తన సొంత విడాకుల అనుభవాల ఆధారంగానే ఈ కథను రాసుకున్నారు. అందుకే ఇందులో లాయర్ల రచ్చ, భార్యాభర్తల మధ్య వచ్చే ఇగోలు చాలా రియాలిటీ గా ఉంటాయి. సినిమాలో హీరో హీరోయిన్లు ఒకరినొకరు అసహ్యించుకుంటూ భయంకరంగా అరుచుకునే ఒక 10 నిమిషాల గొడవ సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీన్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం ఆడమ్ డ్రైవర్, స్కార్లెట్ జోహాన్సన్ దాదాపు 50 సార్లకు పైగా టేకులు తీసుకున్నారట. ఆ సీన్ షూటింగ్ అయిపోయేసరికి వాళ్లిద్దరూ పూర్తిగా నీరసించిపోయారట. మరో విశేషం ఏంటంటే, ఇందులో లాయర్ల పాత్రలు. చార్లీ, నికోల్ లాయర్లు వాడే తెలివితేటలు, అవతలి వ్యక్తిని కోర్టులో ఎలా తక్కువ చేసి చూపిస్తారో దర్శకుడు చాలా డీటైల్డ్‌గా చూపించారు. ఈ సినిమాలో నటించిన లారా డెర్న్‌కు ఆస్కార్ అవార్డు రావడమే కాకుండా, సినిమా మొత్తం మీద ఆరు ఆస్కార్ నామినేషన్లు దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో అత్యధిక రేటింగ్ పొందిన సినిమాల్లో ఇది ఒకటి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

న్యూయార్క్‌కు చెందిన థియేటర్ డైరెక్టర్ చార్లీ (ఆడమ్ డ్రైవర్), నటి నికోల్ (స్కార్లెట్ జోహాన్సన్) విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఒకప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకో బాబు కూడా ఉంటాడు. అయితే సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్ కదా, కానీ వీళ్ళ మధ్య అవి పెద్దవైపోయి విడిపోదాం అనుకుంటారు. మనం మాట్లాడుకుని విడిపోదాం, మధ్యలో ఈ కోర్టులు, లాయర్లు వద్దని మొదట అనుకుంటారు. కానీ కొడుకు విషయంలో అసలు కథ మొదలవుతుంది. చార్లీ తన దగ్గరే ఉంటాడని పట్టుబట్టడంతో, నికోల్ తన కొడుకుని తీసుకుని న్యూయార్క్ నుండి తన సొంత ఊరు లాస్ ఏంజిల్స్ కి వెళ్ళిపోతుంది. వీళ్ళ మ్యాటర్ ఇప్పుడు కోర్టుకు వెళ్తుంది. ఇక అక్కడి నుండి ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఒకప్పుడు ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్న వాళ్ళే, ఇప్పుడు లాయర్ల ప్రోద్బలంతో ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటారు.

ఒకరి లోపాలను ఒకరు ఎత్తిచూపుకుంటూ, అసహ్యించుకుంటూ నానా హంగామా చేస్తారు. ముఖ్యంగా ఒక సీన్‌లో ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ, గోడలు బాదుకుంటూ ఏడ్చే సీన్ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ప్రేమ ఉన్న చోటే ఇంత పగ కూడా ఉంటుందా అనిపిస్తుంది. చివరికి గొడవలన్నీ పడి, లాయర్లకి లక్షల రూపాయలు తగలేసి విడాకులు అయితే తీసుకుంటారు. కానీ విడిపోయిన తర్వాత కూడా వాళ్ళ మధ్య ఒక తెలియని అనుబంధం మిగిలే ఉంటుంది. సినిమా చివర్లో చార్లీ షూ లేస్ ఊడిపోతే నికోల్ కట్టిస్తుంది. ఆ సీన్ కూడా అందరినీ హత్తుకుంటుంది. మొత్తానికి భార్యాభర్తల మధ్య గొడవలు ఎంత భయంకరంగా ఉంటాయో, అవి పిల్లల మీద ఎంత ప్రభావం చూపుతాయో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

Advertisement

Read Also : కొడుకు కోసం ఓ తల్లి త్యాగం… మనసుని కలిచివేసే కథ… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×