Celebrity Social Look: సినీ, టీవీ సెలబ్రిటీలు తమ పోస్ట్స్ నెటిజన్స్, ఫాలోవర్స్‌ని అలరిస్తుంటారు. సినీ, టీవీ తారలు నెట్టింట చేసే సందడి అంతా ఇంత కాదు. ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మలు తమ ఫోటోలతో ఫ్యాన్స్‌ని కనువిందు చేస్తుంటారు. హాట్ హాట్ గా, కూల్ కూల్ లుక్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు.ఇలా ఎంతో సినీ, టీవీ అందాల తారలు తమ లేటెస్ట్ లుక్స్ షేర్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. మరి ఈ రోజుల మన ముద్దుగుమ్మలు చేసిన పోస్ట్స్, వారి ముచ్చట్లు ఏంటో ఇక్కడ చూద్దాం.
యంగ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ గురించి తెలిసిందే. ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. మిస్టర్ బచ్చన్‌లో రవితేజతో రోమాన్స్ చూసి తెగ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈక్రమంలో భాగ్యశ్రీ తాజాగా ఓ రెస్టారెంట్‌లో సందడి చేసింది. ‘జీవితం చాలా చిన్నది.. పిజ్జా ఆర్డర్ చేయకుండ ఉండగలేమంటూ’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
టిక్‌టాక్ ఫేం, బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. పైగా అవి పెద్దగా హిట్ కూడా కాదు. కానీ, ఈ భామ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. తరచూ తన బోల్డ్ లుక్స్, గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను చూపు తనవైపు తిప్పుకుంది. తాజాగా అషు రెడ్డి కారుతో కలిస ఫోజులు ఇచ్చింది. వాటిని షేర్ చేస్తూ ఈ కారు నాకంటే వంపులు తిరిగి ఉందంటూ తన బాడీ షేప్ తనే కామెంట్స్ విసురుకుంది.
రమ్య పసుపులేటి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో ఈ భామ చేసే సందడ అంత ఇంత కాదు. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె హీరోయిన్‌గా ఆఫర్ కొట్టేసింది. ఇటీవల హుషారు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. కూల్ గా వాటర్ మెలెన్ తింటూ హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీనికి మీరు రెగ్యులర్‌గా తీసుకునే విటమిన్ సి కాదు అంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బుల్లితెర నటి స్రవంతి క్రష్ణన్ గురించి తెలిసిందే. ఈ భామ గ్లామర్ పడిపోని మగాళ్లు లేరు. ఏకంగా నాగార్జున సైతం స్రవంతి స్టైల్, అందానికి పడిపోయాడు. చాలా చక్కగా ఉంటావంటూ బిగ్ బాస్ హౌజ్‌లో నాగ్ చేత ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిలైన ఈ భామ అప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలతో తళుక్కు మెరుస్తుంది. తాజాగా తన లేటెస్ట్ ఫోటోల్లో చీరకట్టులో వయ్యారాలతో హోయలు పోయింది ఈ భామ. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రీతి ముకుందన్ గురించి తెలిసిందే. మలయళి ప్రైవేట్ అల్బమ్ లో నటించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ క్రేజ్ తో తెలుగులో ఏకంగా మంచు విష్ణు కన్నప్ప మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో హాట్ లుక్స్, ఫోజులు నెటిజన్ల చూపు తనవైపు తిప్పుకుంది.