OTT Movie : గుజరాతీ సినిమా ఇండస్ట్రీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా కామెడీ, ట్రాజెడీ, ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రం ఒక యువకుడి జీవితంలోని ఒడిదొడుకులను, ముగ్గురు అపరిచితులతో జరిగే రోడ్ ట్రిప్ ద్వారా చక్కగా చూపించారు. చిన్మయ్ పర్మార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, హాస్య రసాలతో కూడిన ఒక మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈ సినిమా పేరు ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
కథలోకి వేళ్తే
ఆదిత్య తన జీవితంలో నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక రోడ్ ట్రిప్‌లో ప్రశాంతంగా తన జీవితాన్ని ముగించాలని ప్లాన్ చేస్తాడు. అయితే అతని ప్రయత్నాలను, కోమల్, జయ్, హరి అనే ముగ్గురు అపరిచిత వ్యక్తులు ఆకస్మికంగా అడ్డుకుంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఆదిత్యతో ఒక రోడ్ ట్రిప్‌లో దగ్గరవుతారు. ప్రతి ఒక్కరూ తమ సొంత జీవిత కథలను బయటికి తీసుకొస్తారు. ఈ ప్రయాణం కామెడీ, ట్రాజెడీ, ఊహించని ట్విస్ట్‌లతో నిండి ఉంటుంది. ఆదిత్య ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను ఈ ముగ్గురు ఎలా మారుస్తారు? వారి సంబంధం ఎలా ఎమోషనల్ గా మారుతుంది? క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆదిత్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అన్నవి ఈ కథలోని కీలక అంశాలు. ఈ రోడ్ ట్రిప్ ఒక సాధారణ ప్రయాణం నుండి లైఫ్ ని మార్చే ఒక జీవిత ప్రయాణంగా మారుతుంది. ఈ ప్రయాణం అతనికి ఎలాంటి పాఠాలు నేర్పింది ? అనేది ఈ గుజరాతీ సినిమాను చూసి తెలుసుకోండి.
రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
‘మితాడ మహేమాన్’ (Mithada maheman) చిన్మయ్ పర్మార్ దర్శకత్వంలో వచ్చిన ఒక గుజరాతీ కామెడీ చిత్రం. ఇందులో యష్ సోని, ఆరోహి పటేల్, మిత్ర గఢ్వి, మిహిర్ నిషిత్ రాజ్దా, సోనాలీ లేలే దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ అయింది. 2025 ఆగస్టు 14 నుంచి షెమారూ మీ (Shemaroome), ఓటీటీ ప్లే (OTT Play) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 120 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.2/10 రేటింగ్ సాధించింది.
Read Also : ఐదుగురు మనుషులతో 30 రోజులు అదే పని… బ్లడీ డెత్ గేమ్… థ్రిల్లింగ్ మలుపులు, ఊహించని సర్ప్రైజులు