E-Paper
Advertisement

Ravi Teja: ఇతన్ని చూసి రవితేజా అనుకున్నారా? కాదండోయ్, ఇతను అసలు తెలుగోడే కాదు

Ravi Teja: ఇతన్ని చూసి రవితేజా అనుకున్నారా? కాదండోయ్, ఇతను అసలు తెలుగోడే కాదు
Advertisement

Ravi Teja: ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు అయితే కొన్ని సందర్భాలలో అది నిజమేనేమో అనిపిస్తుంది .ఒక వ్యక్తి పోలికలు ఉన్న మరొక వ్యక్తులు అప్పుడప్పుడు కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారి పోలికలతోనే కనిపించడంతో వారు కూడా సెలబ్రిటీ రేంజ్ లో పాపులర్ అవుతూ ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోల పోలికలతో ఉన్నవారి ఫోటోలు ఇదివరకు బాగా వైరల్ అయ్యాయి అయితే తాజాగా రవితేజ (Raviteja)పోలికలతో ఉన్న వ్యక్తి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు.

రవితేజకు జిరాక్స్ లాగా ఉన్నాడే..

హీరో రవితేజ పోలికలతో ఉన్న ఈ వ్యక్తి పేరు శ్రవణ్ కుమార్(Sravan kumar). ఈయన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. నార్త్ ఇండస్ట్రీకి చెందిన శ్రావణ్ కుమార్ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన వెలుగులోకి వచ్చారు అయితే అచ్చం ఈయన రవితేజ పోలికలతో ఉండడంతో ప్రస్తుతం మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. రవితేజ ముఖ కవళికలతో పాటు రవితేజ లాగే ఈయన కూడా స్టైల్ అనుకరిస్తున్న నేపథ్యంలో వెంటనే చూడగానే రవితేజ అనే భావన కలుగుతుంది. ఇలా సోషల్ మీడియాలో ఈయన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రాత్రికి రాత్రి సెలబ్రిటీ హోదా..

Advertisement

ఇలా ఈయన ఫోటోలు చూసినా రవితేజ అభిమానులు రవితేజకు డూప్ లాగే ఉన్నారు. ఆ భగవంతుడు కూడా సెలబ్రిటీలను ఇలా కాపీ పేస్ట్ చేస్తూ ఇలాంటి వారందరిని రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చేస్తున్నారు అంటూ ఈయన రీల్స్ పై కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రవితేజ లాగా కనిపిస్తున్న శ్రవణ్ కుమార్ వీడియోలపై ఓ లుక్ వేసేయండి. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలను పోలిన వారు మాత్రమే కాదు హీరోయిన్ల పోలికలతో కూడా కొంతమంది వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా పుణ్యమా అంటూ వాళ్లుకూడా ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్నారు.

https://www.instagram.com/shrawanmahala0792/reels/

Advertisement

ఇక రవితేజ సినిమా కెరియర్ విషయానికి వస్తే ఇప్పటివరకు 76 సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కాస్త పరవాలేదు అనిపించింది ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు ఇక ఈ సినిమా విభిన్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Also Read: Sreeleela: ఇట్స్ అఫీషియల్.. ధనుష్ సినిమాలో శ్రీలీల..ఇక టాలీవుడ్ కు గుడ్ బై చెప్పినట్టేనా?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×