E-Paper
Advertisement

Sreeleela: పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు.. శ్రీలీల ఆశ్చర్యకర వ్యాఖ్యలు..!

Sreeleela: పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు.. శ్రీలీల ఆశ్చర్యకర వ్యాఖ్యలు..!
Advertisement

Sreeleela: తెలుగు ప్రేక్షకులకు పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన శ్రీలీల..ఆ తర్వాత రవితేజతో చేసిన ధమాకా సినిమా ద్వారా పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక బాలకృష్ణతో చేసిన భగవంతు కేసరి సినిమాలో కూడా ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో శ్రీలీలకు నటిగా మంచి పేరు వచ్చింది.

అయితే ఆ తర్వాత ఆమె చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇటీవల తమిళ ఇండస్ట్రీలో పరాశక్తి అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. వరుసగా ఫ్లాపులు వచ్చినా కూడా శ్రీలీలకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా ఆమె ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Advertisement

ఈ క్రమంలో తాజాగా శ్రీలీల నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించింది. అక్కడ విద్యార్థులతో సరదాగా మాట్లాడుతూ, “మిమ్మల్ని చూసి జోష్‌లో అరిచి అరిచి గొంతు ఎలా అయిపోయిందో చూడండి” అంటూ నవ్వుతూ చెప్పింది. అప్పుడు అక్కడ ఉన్న గుంపులోని ఒక అబ్బాయి గట్టిగా “డాన్స్ వెయ్యి… డాన్స్… డాన్స్” అని అరవడం జరిగింది.

Advertisement

దానికి శ్రీలీల ఏమాత్రం అసహనం చూపకుండా, చిరునవ్వుతో “అచ్చం పెళ్ళాన్ని అడిగినట్లే అడిగారు” అంటూ సరదాగా పంచ్ ఇచ్చింది. ఆమె స్పందన అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలామంది శ్రీలీల కూల్‌నెస్‌ను..ఆమె ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌ను మెచ్చుకుంటున్నారు.

అయితే మరోవైపు కొంతమంది మాత్రం ఆ అబ్బాయి మాట్లాడిన తీరు సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే..ఇలాంటి మాటలు మర్యాదగా ఉండాలని, పబ్లిక్ ప్లేస్‌లో ఇలా అరవడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా..శ్రీలీల మాత్రం ఈ సంఘటనను చాలా పాజిటివ్‌గా తీసుకుని, తన చమత్కారంతో అక్కడి వాతావరణాన్ని లైట్ చేసింది. ఇదే ఆమెకు ప్రేక్షకుల్లో ఉన్న అభిమానానికి మరో కారణంగా మారుతోంది.

ALSO READ: Salman Khan defamation case: సల్మాన్ ఖాన్ ప్రతిష్ఠకు భంగం.. ముంబై కోర్టు కీలక ఆదేశాలు.. ఏకంగా 9 కోట్లు ఇవ్వాలని..!

Related News

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Big Stories

Advertisement
×