E-Paper
Advertisement

Psych Siddhartha Trailer: నందు సైక్ సిద్ధార్థ్ ట్రైలర్ రిలీజ్..ఇదేం యాక్టింగ్ రా బాబు!

Psych Siddhartha Trailer: నందు సైక్ సిద్ధార్థ్ ట్రైలర్ రిలీజ్..ఇదేం యాక్టింగ్ రా బాబు!
Advertisement

Psych Siddhartha Trailer: ప్రముఖ సినీ నటుడు నందు(Nandu) హీరోగా ఇదివరకు పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే నందు నటన పరంగా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా విభిన్న కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. త్వరలోనే నందు హీరోగా “సైక్ సిద్ధార్థ్” (Psych Siddhartha)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఇటు పక్క జెఫ్ బెజోస్.. అటు పక్క ఎలాన్ మస్క్

తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియోలో భాగంగా నందు అద్భుతమైన నటనను కనబరిచారని చెప్పాలి. ఇక ట్రైలర్ చూస్తుంటే మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఈ ట్రైలర్ విషయానికి వస్తే లవ్, కెరీర్, బిజినెస్‌లో ఫెయిల్యూర్ అయిన ఓ సాధారణ యువకుడు ప్రతి చిన్న విషయానికి ఎంతో అసూయ పడుతూ ఉంటాడు. ఇలాంటి ఒక కుర్రాడు అన్నింటిని కోల్పోయి తన జీవితంలో ఎదురైన సవాలను ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది.ఇటు పక్క జెఫ్ బెజోస్ ఉంటాడు. అటు పక్క ఎలాన్ మస్క్ ఉంటాడు. మధ్యలో సిద్దార్థ్ రెడ్డి అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఒక విభిన్న కాన్సెప్ట్ సినిమా ద్వారా నందు మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Advertisement

ఈ సినిమాకు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా శ్రీనందు, యామినీ భాస్కర్‌ హీరో హీరోయిన్ గా నటించారు. ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక వంటి తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో రానా దగ్గుబాటి,నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక డిసెంబర్ 12వ తేదీ పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే సుమ కనకాల కుమారుడు రోషన్ నటించిన మోగ్లీ సినిమాతో పాటు మరిన్ని సినిమాలు కూడా 12వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద మంచి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక నందు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Also Read: MSVPG: చిరు వెంకీ సాంగ్ షూటింగ్ పై అప్డేట్.. మాస్ సాంగ్ లోడింగ్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×