MSVPG Movie : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసే పనిలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా వెంకటేష్ చిరంజీవి పై ఒక మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతోందని చిత్ర బృందం ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇలా వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సాంగ్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ పాట కోసం ఏకంగా భారీ సెట్ నిర్మించడమే కాకుండా ఏకంగా 500 మంది డాన్సర్లతో షూట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ పాట కోసం రంగంలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంద. ఎన్నో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రాఫర్ గా విజయ్ పని చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఒక స్టార్ కొరియోగ్రాఫర్ నేతృత్వంలో వెంకటేష్ చిరంజీవి మాస్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలియడంతో ఈ పాటపై మంచి అంచనాలే ఉన్నాయి. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ క్యామియో పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సుమారు 22 నిమిషాల పాటు వెంకటేష్ పాత్ర ఉండబోతుందని స్వయంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత చిరంజీవి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అనిల్ రావిపూడి ధీమా వ్యక్తం చేశారు.
?igsh=bXVnN3l1dXd6aXlo
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఈ సినిమా నుంచి మీసాల పిల్ల అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఈ పాటకు అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టి వరుస అప్డేట్స్ తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల కానుంది. అనిల్ రావిపూడి చివరిగా వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా అనంతరం చిరంజీవితో చేస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి సన్ షైన్ బ్యానర్ పై సాహు గారపాటి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పై సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Samantha Marriage: సమంత రెండో పెళ్లి… విలన్ అంటూ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్