Sreeleela: టాలీవుడ్‌లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగిపోయిన శ్రీలీల (Sreeleela), ఇప్పుడు తన కెరీర్ రూటును పూర్తిగా బాలీవుడ్ (Bollywood) వైపు మళ్లించింది. తెలుగులో ‘ధమాకా’ (Dhamaka) వంటి భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వరుసగా ఎదురైన ఫ్లాపులు ఈ భామని ఆలోచనలో పడేశాయి. తమిళ్‌లో చేసిన తొలి ప్రయత్నం ‘పరాశక్తి’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఇప్పుడు శ్రీలీల తన ఆశలన్నీ ముంబై నగరంపైనే, అదే బాలీవుడ్ పైనే పెట్టుకుంది. ఈ క్రమంలో ఆమె లుక్, యాటిట్యూడ్, పబ్లిక్ అప్పీరెన్స్‌లో చాలా ఛేంజ్ కనిపిస్తుంది. టాలీవుడ్‌లో ఏ సినిమా చేసినా, ఆమె ఎంతో పద్దతిగా చీర లేదంటే లంగా వోణి కట్టుకుని వచ్చేది. తెలుగింటి అమ్మాయిలా అందరినీ ఆకర్షించేది. కానీ, ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ గాలి ఆమెకు వంట పట్టేసిందనేలా మారిపోయింది.
Also Read- AVAA Entertainment: 3 వేల ఎంట్రీలు, 100 మంది ఫైనలిస్టులు.. 10 కోట్లతో ఫీచర్ ఫిల్మ్ చేసే దర్శకుడెవరో?
బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే కేవలం నటన తెలిస్తే సరిపోదు, అక్కడ గ్లామర్ అనేది ఒక ప్రధాన ఆయుధమనే విషయం తెలియంది కాదు. సౌత్ సినిమాల్లో కొంత పద్ధతిగా కనిపించే హీరోయిన్లు సైతం, ముంబై వెళ్లాక రూటు మార్చడం కామన్. ఇప్పుడు శ్రీలీల విషయంలోనూ ఇదే జరుగుతోంది. మొన్నటి వరకు హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు గ్లామర్ గేర్ మార్చేసింది. ట్రెండీ అవుట్‌ఫిట్స్, బోల్డ్ ఫొటోషూట్స్, అదిరిపోయే మేకోవర్‌తో బాలీవుడ్ జనాల కళ్లలో పడేలా ప్లాన్ చేస్తోంది. అంతేనా, బాలీవుడ్ సంస్కృతిలో మరో ముఖ్య అంశమైన నెట్‌వర్కింగ్‌పై కూడా ఆమె దృష్టి పెట్టింది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల కళ్లలో పడాలన్నా, స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకోవాలన్నా అక్కడ జరిగే హై-ప్రొఫైల్ పార్టీలకు, అవార్డు వేడుకలకు హాజరుకావడం తప్పనిసరి. శ్రీలీల ఇప్పుడు అదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ఇటీవల ముంబైలో జరుగుతున్న పలు ఈవెంట్లలో శ్రీలీల తన ప్రెజెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన డ్రెస్సింగ్ స్టైల్‌లో కూడా గ్లామర్ డోస్ పెంచి, బాలీవుడ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. మొదటి సినిమా విడుదల కాకముందే, అక్కడి పద్ధతులను వంటబట్టించుకుని పక్కా ముంబై గర్ల్‌లా మారిపోయిందనే టాక్ అప్పుడే శ్రీలీలపై మొదలైందంటే ఏ రేంజ్‌లో ఆమె మేకోవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Attitude Star: నువ్వు పాడింది భగవద్గీత కాదు.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలా? బెదిరిస్తున్నావా?
శ్రీలీల నటిస్తున్న మొదటి హిందీ చిత్రం ఈ ఏడాది వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తనకు రాని అదృష్టం బాలీవుడ్‌లో దక్కుతుందని ఆమె బలంగా నమ్ముతోంది. అక్కడ ఒక సినిమా హిట్ అయితే చాలు, నేషనల్ లెవల్‌లో గుర్తింపు వస్తుంది. అందుకే ప్రస్తుతం టాలీవుడ్‌ను పక్కన పెట్టి మరీ అక్కడి ప్రాజెక్టులపైనే ఫోకస్ పెట్టింది. శ్రీలీల కొత్త లుక్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే బాలీవుడ్‌లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడేలాగే కనిపిస్తోంది. తెలుగులో మిస్ అయిన సక్సెస్ ట్రాక్‌ను హిందీలో పట్టుకుంటుందా? వేసవిలో వచ్చే ఆ సినిమా శ్రీలీల ఫేట్ మార్చుతుందా? అనేది చూడాలి. తన గ్లామరస్ ప్రమోషన్స్ మాత్రం ఇప్పుడే సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. అన్నట్టు, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా హిట్టయింతే.. మరోసారి టాలీవుడ్‌లోనూ ఆమె బిజీ నటి అయ్యే అవకాశం లేకపోలేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో..
Also Read- Biker Glimpse: రాజశేఖర్ బైకర్ గ్లింప్స్..బుల్లర్ సునీల్ పాత్రతో సర్ప్రైజ్