E-Paper
Advertisement

Balakrishna: బాలయ్యతో ఆ దర్శకుడు.. అస్సలు ఊహించని కాంబినేషన్!

Balakrishna: బాలయ్యతో ఆ దర్శకుడు.. అస్సలు ఊహించని కాంబినేషన్!
Advertisement

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Natasimham Balakrishna) ఊహించని దర్శకుడితో వర్క్ చేయబోతున్నట్లుగా తాజాగా టాలీవుడ్‌లో వార్తలు మొదలయ్యాయి. గాడ్ ఆఫ్ మాసెస్‌గా పేరున్న బాలయ్య, ఒక యంగ్ డైరెక్టర్‌కి అవకాశం ఇవ్వడంతో ఇప్పుడా దర్శకుడి పేరు వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా దర్శకుడు? అనే విషయానికి వస్తే.. నానితో ‘అంటే సుందరానికీ’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలు చేసిన వివేక్ ఆత్రేయ (Vivek Athreya)కు నందమూరి బాలయ్య అవకాశం ఇచ్చాడట. వివేక్ ఆత్రేయ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తుంది. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, నిజంగా ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఎవరూ ఊహించను కూడా ఊహించరు. ఎందుకంటే, సాఫ్ట్ కథలతో సినిమాలు చేసే వివేక్ ఆత్రేయ ఎక్కడ? మాస్‌ అంటే గుర్తొచ్చే బాలయ్య ఎక్కడ? అసలు బాలయ్య పవర్‌ని ఈ దర్శకుడు తట్టుకోగలడా? అనేలా అప్పుడే ఇండస్ట్రీలో టాక్ కూడా మొదలైంది.

Also Read- Sreeleela: బాలీవుడ్ గాలి వంటపట్టింది.. పబ్లిక్ అప్పీరెన్స్‌లో భారీ మార్పు!

ఒక్కసారి కమిటైతే..

Advertisement

అయితే బాలయ్య మాత్రం అలాంటివేవీ పట్టించుకోడు. దర్శకుడంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని భావించే హీరో ఆయన. ఒక్కసారి ఆయన కమిటై, సెట్స్‌పైకి సినిమా వెళ్లిందంటే, ఇక దర్శకుడు ఏం చెప్తే అదే. ఇదే బాలయ్య స్టైల్. అలా అనుకుంటే అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమా చేస్తాడని ఎవరైనా ఊహించి ఉంటారా? ఇది కూడా అంతే. ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో అని అంటుంటారు కదా. వివేక్ ఆత్రేయ దగ్గర అద్భుతమైన కథ ఉండి ఉండవచ్చు. అది నటసింహానికి నచ్చి ఉండవచ్చు. అందుకే ఓకే చెప్పి ఉంటాడా? అనేలా కూడా టాక్ నడుస్తుంది. మాములుగా అయితే బాలయ్య అనగానే బోయపాటి శ్రీను వంటి డైరెక్టరే అంతా గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ ఆయన గోపీచంద్ మలినేని, బాబీ, అనిల్ రావిపూడి వంటి వారితో కూడా సినిమాలు చేసి, హిట్స్ కొట్టారు. ఇవి మాత్రం ఎవరికీ గుర్తుండవు.

Also Read- Attitude Star: నువ్వు పాడింది భగవద్గీత కాదు.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలా? బెదిరిస్తున్నావా?

కుర్ర దర్శకులకే అవకాశం

Advertisement

ప్రస్తుతం అగ్ర హీరోలైన చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ కుర్ర దర్శకులనే ఎక్కువగా నమ్ముతున్నారు. వాళ్లతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు, హిట్స్ కొడుతున్నారు. చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో హిట్ కొట్టారు. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా తర్వాత బాబీతో మరోసారి ఆయన చేతులు కలుపుతున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయనున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ కథ ఓకే అయితే.. నెక్స్ట్ దర్శకుడు ఆయనే. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నా, ఆ వెంటనే మళ్లీ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. నాగార్జున రా. కార్తీక్ అనే దర్శకుడితో తన వందవ సినిమా చేస్తున్నారు. సో.. కుర్ర దర్శకులకే ఈ హీరోలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే విషయం క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి.. బాలయ్యతో వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి.. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో?

Also Read- Horror Thriller Movie OTT : దెయ్యంతో డీల్ మాట్లాడే తండ్రి… చెలరేగిపోయే పిశాచి…కూతురి ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ హారర్

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×