E-Paper
Advertisement

Sreeleela : కోలీవుడ్ లో శ్రీలీలకు మరో ఆఫర్.. క్రేజీ హీరో మూవీలో ఛాన్స్..!

Sreeleela : కోలీవుడ్ లో శ్రీలీలకు మరో ఆఫర్.. క్రేజీ హీరో మూవీలో ఛాన్స్..!
Advertisement

Sreeleela : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి ఆమె వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తుంది. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటివరకు ఆమెకు స్టార్ ఇమేజ్ అయితే దక్కలేదు.. తెలుగులో మాత్రమే కాదు అటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటుంది.. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా పరాశక్తి సినిమా రిలీజ్ అయింది.. ఆ మూవీలో హీరో శివ కార్తికేయ కు జోడిగా శ్రీ లీలా నటించింది.. ఇప్పుడు కోలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈసారి ఏకంగా స్టార్ హీరోతో జతకట్టబోతుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. మరి ఆ హీరో ఎవరు? ఏ మూవీలో నటించబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

స్టార్ హీరో మూవీలో శ్రీలీలకు ఛాన్స్.. 

తమిళ స్టార్ హీరో అజిత్ ఇటీవల ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీతో ప్రేక్షకులు ముందుకు ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో సినిమాలో అజిత్ నటించబోతున్నాడు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో అజిత్ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ గురించి అతి త్వరలోనే ఓ ప్రకటన రాబోతుందని సమాచారం. అయితే అజిత్ కి జోడిగా హీరోయిన్ ని వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పారాశక్తి సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న శ్రీలీలను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ కాంబో కనుక ఫిక్స్ అయితే మాత్రం శ్రీ లీల ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా పడిపోయినట్లే అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ మూవీ గురించి అతి త్వరలోనే చిత్ర యూనిట్ అప్డేట్ ఇవ్వనుందని సమాచారం..

Advertisement

Also Read :మహాను మోసం ప్రతాప్.. సర్టిఫికెట్ ను కాల్చివేసిన ప్రతాప్.. టెన్షన్ లో చక్రీ..

కోలీవుడ్ లో శ్రీలీలకు ఆఫర్స్.. 

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె అదృష్టం కొద్దీ స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు వస్తున్నాయి.. కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఆమెకు స్టార్ ఇమేజ్ ని తీసుకురాలేదు. రీసెంట్ గా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా వరుసగా సినిమాలు చేసే అవకాశాన్ని అందుకుంటుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన పరాశక్తి మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో నటించబోతుంది అంటూ ప్రచారంలో ఉంది. వీడుతో పాటుగా తెలుగులో మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అంతే కాదు. ఇటీవలే ఆమె తన డాక్టరేట్ పట్టాను అందుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ తెలుగులో ఏ హీరోతో సినిమా చేస్తుందో చూడాలి..

Related News

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

Big Stories

Advertisement
×