E-Paper
Advertisement

Sridevi Apalla: రీల్స్ చేస్తుంటే ‘కోర్ట్’ హీరోయిన్ శ్రీ దేవి తల్లి ఏం అనేవారో తెలుసా.. అయినా కానీ..

Sridevi Apalla: రీల్స్ చేస్తుంటే ‘కోర్ట్’ హీరోయిన్ శ్రీ దేవి తల్లి ఏం అనేవారో తెలుసా.. అయినా కానీ..
Advertisement

Sridevi Apalla: సోషల్ మీడియాలో చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు వెండితెరపై నటిగా రాణిస్తున్న శ్రీదేవి అపాల తన కెరీర్ ఆరంభంలో ఎదురైన సవాళ్ల గురించి మనసు విప్పారు. కేవలం వినోదం కోసం చేసిన రీల్స్ తనను ఒక నటిగా ఎలా తీర్చిదిద్దాయో, ఆ క్రమంలో తన కుటుంబం ఎదుర్కొన్న సామాజిక ఒత్తిడి ఎలాంటిదో ఆమె వివరించారు. కోర్టు సినిమాతో తనకంటూ ఓ ప్రత్యే కత తెచ్చుకున్న నటి ప్రస్తుతం బ్యాండ్ మేళం సినిమాలో నటిస్తున్నారు.

Read also-Ustaad Bhagath Singh : పవన్ సినిమా ప్రీమియర్స్ పై కన్ఫ్యూజన్.. నైజాం పరిస్థితి ఏంటి..?

బంధువుల విమర్శలు

Advertisement

శ్రీదేవి తన విజయానికి ప్రధాన కారణం తన తల్లి అని పేర్కొన్నారు. స్కూల్, కాలేజీకి వెళ్లే వయసులో రీల్స్ చేస్తూ, స్టార్ కావాలని కలలు కంటున్నప్పుడు చుట్టుపక్కల వారు బంధువుల నుండి విమర్శలు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. “ఆడపిల్లని అలా వదిలేశారు ఏంటి? చదువుకోకుండా ఈ రీల్స్ ఏంటి?” అని చాలామంది తన తల్లిని ప్రశ్నించేవారని, కానీ తన తల్లి మాత్రం ఆ మాటలేవీ పట్టించుకోకుండా తనను నిరంతరం ప్రోత్సహించిందని శ్రీదేవి ఎమోషనల్ అయ్యారు. తనను వెండితెరపై చూసుకోవాలన్నది తన తల్లి బలమైన కోరిక అని ఆమె వెల్లడించారు.

Read also-Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్.. ఇంటింటి రామాయణం పరిస్థితి ఇదే..?

చదువు..

Advertisement

చదువు విషయంలో శ్రీదేవి మాట్లాడుతూ.. తాను చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో ఈ వీడియోలు చేసేదాన్నని చెప్పారు. తనకు సైన్స్, బయాలజీ అంటే చాలా ఇష్టమని, కానీ మ్యాథ్స్ అంటే మాత్రం కొంత భయం ఉండేదని సరదాగా పంచుకున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ గారు తన టాలెంట్‌ను గుర్తించి, “ఈ అమ్మాయి చాలా నాలెడ్జ్ ఉన్న పిల్ల, తనని చదువుకోమని ఫోర్స్ చేయకుండా తనకిష్టమైన రంగంలో ప్రోత్సహించండి” అని తన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. సక్సెస్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదని శ్రీదేవి అభిప్రాయపడ్డారు. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ మరియు కష్టం తర్వాతే ‘కోర్ట్’ వంటి సినిమాల్లో మంచి అవకాశాలు లభించాయని ఆమె తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మన కష్టాన్ని మనం నమ్ముకుంటే, ఈ విశ్వం కచ్చితంగా మనకు మార్గం చూపిస్తుందని ఆమె గట్టిగా నమ్ముతారు. ప్రస్తుతం నటిగా తను సాధించిన ఈ గుర్తింపు తన తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×