E-Paper
Advertisement

SS Rajamouli: రాముడు ఒక బోరింగ్ క్యారెక్టర్, ఏమైనా అంటే అందరికీ కోపాలు వచ్చేస్తాయి

SS Rajamouli: రాముడు ఒక బోరింగ్ క్యారెక్టర్, ఏమైనా అంటే అందరికీ కోపాలు వచ్చేస్తాయి
Advertisement

Rajamouli Comments on Lord Rama: దేవుడిని నమ్మడం నమ్మకపోవడం అనేది పూర్తిగా మన వ్యక్తిగత వ్యవహారం. చాలామంది దేవుడిని విపరీతంగా నమ్ముతారు. కొంతమంది అసలు నమ్మరు. కానీ దేవుడి గురించిన కథలను మాత్రం చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు. అయితే రీసెంట్ గా వారణాసి సినిమా ఈవెంట్లో రాజమౌళి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మూవీ ట్రైలర్ లో ప్రదర్శనకు టెక్కినల్ గ్లిచ్ రావడంతో ఆయన చాలా టెన్షన్ పడ్డారు. ఇంత కష్టపడ్డా ఏదోక అడ్డంకి అంటూ అసహనం చూపించారు. ఇది దేవుడిపై చూపించడంతో పలు హిందుసంఘాల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో జక్కన్నపై విమర్శలు చేస్తూ కామెంట్స్ చేశారు.

నేను దేవుడిని నమ్మను..

Advertisement

అయితే ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. నేను మామూలుగా దేవుని నమ్మను. ఈ సినిమా గురించి టెన్షన్ పడుతున్నప్పుడు మా నాన్నగారు నువ్వేం భయపడకు వెనక ఉండి హనుమంతుడు అన్ని నడిపిస్తాడు అని భుజం తట్టారు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇదేనా నడిపించడం అంటే అని. నా భార్య కూడా హనుమాన్ కు వీరాభిమాని తనని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది. అంటూ మాట్లాడారు. నేను దేవుని నమ్మను అని రాజమౌళి మాటలు పట్టుకుని చాలామంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి దేవుడి గురించి మాట్లాడటం ఇది మొదటి సారి కాదు. చాలా సందర్భాలలో దేవుడు గురించి రాజమౌళి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. బాహుబలి సినిమా టైంలో మాట్లాడుతూ రాజమౌళి చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి.

రాముడు బోరింగ్ క్యారెక్టర్

మామూలుగా కథపరంగా చూసుకుంటే రాముడిది చాలా బోరింగ్ క్యారెక్టర్. నాకు రాముడు కంటే కృష్ణుడి పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. రాముడికి ఒక భారీ మాత్రమే ఉంటుంది. కృష్ణుడికి ఏకంగా 1600 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. రాముడు పెద్దలు చెప్పిన మాట వింటుంటారు. కానీ రాముడి క్యారెక్టర్ ఎందుకు పవర్ఫుల్ అయింది అంటే, రాముడు చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. హనుమంతుడి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి హనుమంతుడే రామున్ని పూజించాడు కాబట్టి రాముడు హైలెట్ అయ్యాడు. నేను బాహుబలి సినిమా విషయంలో కూడా అమరేంద్ర బాహుబలికి మంచి క్వాలిటీస్ పెట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళని స్ట్రాంగ్ క్వాలిటీ ఉండేలా డిజైన్ చేశాను అంటూ మాట్లాడారు.

పాత ట్వీట్స్ తవ్వకం

Advertisement

అయితే రాజమౌళి మాటలను పట్టుకొని చాలామంది పాత ట్వీట్స్ కూడా గతంలో ఏం చేశాడు అని వెతకడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో 2011లో ఒక ట్వీట్ కి ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక నెటిజన్ రాజమౌళికి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతాడు. శుభాకాంక్షలు చెప్పినందుకు చాలా థాంక్యూ కానీ నేను రామున్ని బేసిక్ గా నమ్మను. నేను రాముని కంటే కృష్ణుడిని ఎక్కువగా నమ్ముతాను అంటూ అప్పట్లో రాజమౌళి మాట్లాడారు.

ఇప్పుడు రాజమౌళి దేవుడి గురించి మాట్లాడిన మాటలు చాలామందికి ఆశ్చర్యకరంగా అనిపించొచ్చు. కానీ రాజమౌళికి ఎప్పటినుంచో దేవుడంటే ఒక రకమైన అభిప్రాయం ఉంది. రాజమౌళి వర్క్ తో పాటు అతను వ్యక్తిత్వాన్ని గమనించిన వాళ్ళకి ఈ విషయం చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక తరుణంలో బాబు గోగినేని కూడా రాజమౌళి దేవుని నమ్మను అని ఇంటర్వ్యూస్ లో చెప్తాడు మరి బాహుబలి సినిమాలో శివుని గురించి ఎలా చూపించాడు అంటూ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

Big Stories

Advertisement
×