E-Paper
Advertisement

అసలు స్టేండప్ కామెడీ అంటే ఏమిటి?.. ఆ కల్చర్ మనపై ప్రభావం ఎంత?

అసలు స్టేండప్ కామెడీ అంటే ఏమిటి?.. ఆ కల్చర్ మనపై ప్రభావం ఎంత?
Advertisement

Standup Comedy: స్టాండప్ కామెడీ అనేది ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఒక వినోదం. కేవలం మైక్ పట్టుకుని స్టేజ్ మీద నిలబడి, ఎదురుగా ఉన్న ప్రేక్షకులను నవ్వించడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే దీని వెనుక ఉన్న చరిత్ర, అపలు అది ఎలా వేస్తారు. ఎందుకు వేస్తారు అన్నది తెలుసుకుందాం.

Read also-హీరో ఎక్స్ ట్రీమ్ To అపాచీ.. చీప్ అండ్ బెస్ట్ డ్యూయల్ ఛానల్ ABS బైక్స్ ఇవే!

స్టాండప్ కామెడీ అంటే ఏమిటి?

Advertisement

సాధారణ కామెడీ స్కిట్స్ లేదా నాటకాలకు, స్టాండప్ కామెడీకి చాలా తేడా ఉంటుంది. ఇందులో వేషధారణలు, సెట్టింగులు, తోటి నటులు ఉండరు. కేవలం ఒకే ఒక వ్యక్తి (కమెడియన్) తన నిజ జీవిత అనుభవాలను, చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను లేదా సమకాలీన అంశాలను హాస్యంతో జోడించి చెబుతుంటారు. ఇక్కడ నవ్వు పుట్టించడానికి ప్రధాన వనరు ‘అబ్జర్వేషన్’, ‘పంచ్ లైన్స్’.

చరిత్ర

స్టాండప్ కామెడీ మూలాలు అమెరికా బ్రిటన్ దేశాల్లో ఉన్నాయి. 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో ‘మ్యూజిక్ హాల్’ సంప్రదాయాల నుండి ఇది పుట్టింది. మొదట్లో గారడీలు, పాటల మధ్యలో విరామ సమయంలో ప్రేక్షకులను వినోదింపజేయడానికి ఒక వ్యక్తి వచ్చి చిన్న చిన్న జోకులు చెప్పేవారు. 1950 – 60ల కాలంలో మార్క్ ట్వైన్ వంటి వారి ప్రభావంతో ఇది ఒక స్వతంత్ర కళారూపంగా మారింది. రాజకీయాలు, మతం, సామాజిక కట్టుబాట్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం స్టాండప్ కామెడీలో ప్రధాన భాగమైంది. అక్కడ ఈ కామెడీ చాలా స్వేచ్ఛగా, ఎటువంటి మొహమాటాలు లేకుండా ఉంటుంది. వ్యక్తిగత జీవితం నుండి దేశాధినేతల వరకు ఎవరినైనా హాస్యపూర్వకంగా విమర్శించే సంస్కృతి అక్కడ ఉంది.

Advertisement

Read also-Chamanthi Serial : ‘ చామంతి ‘ సీరియల్లో ప్రభాకర్ క్యారక్టర్ ఇదా..? రెమ్యూనరేషన్ అంతనా..?

అనుదీప్ కామెడీ

ఇటీవల తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితాల మీద వేసిన జోకులు, అభిమానులకు కార్యకర్తలకు ఇబ్బందిని కలిగించాయి. అందులో అనుదీప్ సినిమా హీరోల వ్యక్తగత జీవితాలను టార్గెట్ చేస్తూ.. జోకులు వేయడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో దిగి వచ్చిన అనుదీప్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో.. ఇలాంటి కామనే అయినా ఇక్కడ మాత్రం కొందరి మనో భావాలు దెబ్బతింటాయి. అయినా జోకులు వాళ్లు చేసే పనుల మీద వేస్తే ఓకే కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి ఇలా అనడం ఆలోచించదగ్గ విషయం అని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి షోలను నియంత్రించే వ్యవస్థలను ప్రభుత్వం తీసుకురావాలి. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×