Top 5 Budget Bikes with Dual ABS: చాలా మంది బైక్ కొనుగోలుదారులు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో ముఖ్యమైన ఫీచర్ డ్యూయల్ ఛానల్ ABS. ఇది రెండు వీల్స్ కు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎమర్జెన్సీగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో వీల్స్ లాక్ కాకుండా చూసి, బైక్ పై కంట్రోల్ ఉండేలా సాయపడుతుంది. ముఖ్యంగా తడి రోడ్లపై చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సింగిల్ ఛానల్ ABS ఉన్న బైక్‌లతో పోలిస్తే, మరింత భద్రతను అందిస్తుంది. ఇప్పుడు భారత మార్కెట్లో డ్యూయల్-ఛానల్ ABSతో లభించే చీప్ అండ్ బెస్ట్ 5 బైక్‌ల గురించి తెలుసుకుందాం..
ప్రస్తుతం డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్‌ను అందించే అత్యంత చవకైన బైక్‌లలో ఒకటి. దీని ధర సుమారు రూ. 1.07 లక్షలు. ఇందులో 124.7cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. సుమారు 11.5 హార్స్ పవర్, 10.5 Nm టార్క్ ఇస్తుంది. రోజువారీ వినియోగానికి ఇది సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు.
ఈ బైక్ ధర సుమారు రూ. 1.17 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 164cc ఇంజన్ ఉంటుంది. 15 హార్స్ పవర్ వరకు శక్తిని ఇస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఈ బైక్ పనితీరు, భద్రతతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది
ఈ బైక్ కూడా డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్‌ను కలిగి ఉంది. దీని ధర సుమారు రూ. 1.24 లక్షలు. ఇందులో 159cc ఇంజన్ ఉండి, సుమారు 15 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. పనితీరు, మైలేజ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
ఈ బైక్ ధర రూ. 1.29 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 160.3cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది సుమారు 16.6 hp పవర్ ఇస్తుంది. కొంచెం స్పోర్టీ ఫీలింగ్ కావాలనుకునే రైడర్లకు ఇది బాగా సరిపోతుంది.
దీని ధర రూ. 1.30 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 159.7cc ఇంజన్ ఉండి, స్పోర్ట్ మోడ్‌లో ఎక్కువ పవర్ ఇస్తుంది. అర్బన్, రైన్ మోడ్‌లలో పనితీరును తగ్గించి, సేఫ్ రైడ్ చేయడానికి సహాయపడుతుంది. ఇది లేటెస్ట్ ఫీచర్లతో కూడిన బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: ఈవీ సెగ్మెంట్ లో మారుతి దూకుడు.. ఏకంగా నాలుగు కొత్త మోడల్స్!
ప్రస్తుతం డ్యూయల్ ఛానల్ ABS ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ గా మారింది. తక్కువ ధరలోనే ఈ ఫీచర్ తో మంచి బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్, అవసరాన్ని బట్టి వీటిలో ఏదైనా బైక్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
Read Also: కియా డబుల్ సర్ప్రైజ్.. సైరోస్ EV, నెక్స్ట్ జనరేషన్ సోనెట్ లాంచింగ్ ఎప్పుడంటే?