E-Paper
Advertisement

Balakrishna: క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు.. బాలయ్యా.. మజాకా?

Balakrishna: క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు.. బాలయ్యా.. మజాకా?
Advertisement

Balakrishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 సంవత్సరాల వయసు దాటినా ఇప్పటికీ వరుస యాక్షన్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే ఇప్పుడు ఆయన క్రేజ్ చూస్తుంటే సీనియర్ హీరోలే కాదు యంగ్ స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య వెంట డైరెక్టర్లు వరుసగా క్యూ కట్టడం చూస్తుంటే.. ఆయన క్రేజ్ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. చివరిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని(Gopichandh malineni) దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.

వరుస సినిమాలతో బిజీగా మారిన బాలయ్య..

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో మళ్లీ ఈ కాంబినేషన్ తెరపైకి రాబోతోందని తెలియడంతో అభిమానులు సైతం చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. అటు గోపీచంద్ కూడా ఈ స్క్రిప్టును మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం గమనార్హం. పైగా యాక్షన్ డ్రామాలో ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య నటించబోయే మరో చిత్రం ఏంటి అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా.. ఇప్పుడు వరుస సినిమాలను ఆయన లైన్ లో పెట్టారు.

బాలయ్య వెంటపడుతున్న స్టార్ డైరెక్టర్లు..

Advertisement

అందులో భాగంగానే బాలయ్య హీరోగా మలయాళ చిత్రం ‘మార్కో’ డైరెక్టర్ హనీఫ్ అదేని (Hanif Adheni) డైరెక్షన్లో దిల్ రాజు ఒక సినిమా నిర్మించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో కూడా బాలయ్య సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బ్రోచేవారెవరురా , అంటే సుందరానికి వంటి చిత్రాలు రూపొందించిన వివేక్ ఆత్రేయ (Vivek Athreya)కూడా బాలయ్య కోసం ఒక మంచి అద్భుతమైన కథను తయారు చేశారని, దానిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలకృష్ణతో డాకూ మహారాజ్ సినిమా నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశీ కూడా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.. ఈ చిత్రానికి కూడా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలయ్య చుట్టూ ఏకంగా ముగ్గురు నలుగురు దర్శకులు పేర్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

ALSO READ:Tollywood: రూమర్స్ తోనే టాప్ పొజిషన్ కి చేరుకున్న యంగ్ బ్యూటీ.. ఎవరంటే?

బాలయ్య వెంట పడడానికి కారణం?

Advertisement

ఇకపోతే బాలయ్యతో పనిచేయడానికి ఈ డైరెక్టర్ల అందరూ ఆసక్తి చూపించడానికి గల కారణం ఏమిటంటే.. ఒక్కసారి బాలయ్య సబ్జెక్టు విని ఓకే చేశారు అంటే మేకింగ్ టైం లో ఎలాంటి మార్పులు చేర్పులకు ఆయన అవకాశం ఇవ్వరు. ముఖ్యంగా సబ్జెక్టు విషయంలో ఆయన ఎలాంటి జోక్యం చేసుకోరు. ముఖ్యంగా బాలయ్య దగ్గర దర్శకులకు ఫ్రీడం లభిస్తుంది. అందుకే బాలయ్యతో పని చేయడానికి ఇప్పుడు వరుస డైరెక్టర్లు క్యూ కడుతున్నారని సమాచారం మొత్తానికైతే ఈ నలుగురు డైరెక్టర్లు ఇప్పుడు బాలయ్యతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పవచ్చు.

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×