E-Paper
Advertisement

Tollywood: రూమర్స్ తోనే టాప్ పొజిషన్ కి చేరుకున్న యంగ్ బ్యూటీ.. ఎవరంటే?

Tollywood: రూమర్స్ తోనే టాప్ పొజిషన్ కి చేరుకున్న యంగ్ బ్యూటీ.. ఎవరంటే?
Advertisement

Tollywood:ఒకప్పుడు సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత మరాఠీ సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ (Mrunal thakur). ఇక హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాలోనే సీతా పాత్రలో నటించి తెలుగు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఒక్క సినిమాతో 100 కోట్లకు క్లబ్లో చేరి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

డెకాయిట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు..

ఈ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాలో కూడా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అదే జోషులో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సరసన ‘ ది ఫ్యామిలీ స్టార్’ సినిమాలో చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అడివి శేష్(Adivi shesh)హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే మృణాల్ ఠాకూర్ తన సినిమాల కంటే కూడా గాసిప్స్ తోనే ఎక్కువగా ఫేమస్ అవుతోందనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

సినిమాలు తక్కువ.. రూమర్స్ ఎక్కువ..

Advertisement

ఒకవైపు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్లతో నిత్యం ట్రెండింగ్ లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఈమె ప్రేమలో ఉంది అంటూ వార్తలు జోరుగా నడిచాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా తెగ హల్చల్ చేశాయి. ఇక టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు అందరూ ఈ విషయంపై చర్చించుకున్నారు. అయితే దీనిపై మృణాల్ స్పందిస్తూ.. ధనుష్ తనకు కేవలం ఒక మిత్రుడు మాత్రమే అని క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్లకు కాస్త చెక్ పడింది. అయినప్పటికీ ఈ గాసిప్ మృణాల్ కు ఫుల్ పబ్లిసిటీని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఇకపోతే ధనుష్ తో వ్యవహారం సద్దుమణిగింది అనుకునే లోపే ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi) తో రిలేషన్ కొనసాగిస్తోందనే వార్తలు బాలీవుడ్లో షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరూ క్లోజ్ గా కనిపిస్తుండడంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అంటూ సోషల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.

ALSO READ:Tollywood: ఆన్లైన్ ద్వారా మూడేళ్లుగా నరకం చూస్తున్నా.. స్క్రీన్ షాట్లతో సహా బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్!

పబ్లిసిటీ స్టంట్ చేస్తోందా?

Advertisement

అయితే ఇది పబ్లిసిటీ స్టంటా లేక నిజంగానే వీరు రిలేషన్ లో ఉన్నారా అనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోంది. మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె ఇలా అతనితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసిందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఏది ఏమైనా మృనాల్ ఠాగూర్ చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా ఇలా వ్యక్తిగతంగా ఎఫైర్ రూమర్స్ విషయంలో మాత్రం టాప్ లో నిలుస్తోంది. మొత్తానికైతే ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ తన ఇమేజ్ను కాపాడుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. మరి భవిష్యత్తులోనైనా వరుస అవకాశాలు అందుకొని సక్సెస్ దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×