E-Paper
Advertisement

Star Hero: పుట్టినరోజున తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన స్టార్ హీరో

Star Hero: పుట్టినరోజున తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన స్టార్ హీరో
Advertisement

Star Hero:  బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన గోవిందా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఆయన సినిమాల్లో హాస్యం, డాన్స్‌తో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నారో, నిజ జీవితంలో అంతకంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడని ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ వెల్లడించారు.

వినయ్ ఆనంద్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోవిందా తన తల్లిపై చూపిన ప్రేమ గురించి మాట్లాడారు. గోవిందా తల్లి పేరు నిర్మలాదేవి. ఆమె గోవిందాకు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు వచ్చినప్పుడు.. గోవిందా చాలా భక్తి భావంతో ఆమె పాదాలను కడిగేవారని వినయ్ చెప్పారు. అంతేకాదు, ఆ నీళ్లనే తాను తాగేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. తల్లి పట్ల గోవిందాకు ఉన్న గౌరవానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని వినయ్ అన్నారు.

Advertisement

సినిమాల్లో ఎంతో బిజీగా ఉండే రోజుల్లో కూడా కుటుంబానికి గోవిందా ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని వినయ్ చెప్పారు. 1990లలో గోవిందా టాప్ హీరోగా ఉన్న సమయంలో, దేశం మొత్తం ఆయన స్టైల్‌ను అనుసరించేదని తెలిపారు. డాన్స్ చేయడం రాని వాళ్లు కూడా గోవిందా సినిమాలు చూసి నృత్యం చేయడం మొదలుపెట్టారని చెప్పారు. కానీ కెమెరా ఆఫ్ అయిన తర్వాత గోవిందా చాలా సాధారణ వ్యక్తిలా..కుటుంబంతో కలిసి ఉండేవారని వివరించారు.

వినయ్ ఆనంద్ మాట్లాడుతూ, గోవిందా తనకు మేనమామ కంటే తండ్రిలాంటి వ్యక్తి అని చెప్పారు. ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ, గోవిందా తనను ఎప్పుడూ సరైన మార్గంలో నడిపించాడని తెలిపారు. వినయ్ ఎన్నో సినిమాల ఆఫర్లు, ఈవెంట్ ఆఫర్లు గోవిందాకు తీసుకెళ్లినా, వాటిలో చాలా వాటిని ఆయన తిరస్కరించేవారని చెప్పారు. ప్రతి నిర్ణయానికి ఆయనకు తనదైన కారణం ఉండేదని తెలిపారు.

Advertisement

గోవిందా వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన కొన్ని గాసిప్‌లపై కూడా వినయ్ స్పందించారు. కుటుంబంపై గౌరవంతో తాను ఆ విషయాల్లో లోతుగా మాట్లాడలేదని చెప్పారు. గోవిందా చెప్పిన మాటలను తాను నమ్ముతానని స్పష్టం చేశారు.

ALSO READ: Vijay Devarakonda: గర్ల్ ఫ్రెండ్ తో విజయ్ దేవరకొండ.. రష్మిక కాదు.. ఇదేం కర్మ రా బాబు..!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×