E-Paper
Advertisement

Raja Saab : ప్రభాస్ పరువు తీసిన ‘రాజా సాబ్’.. అక్కడ బుకింగ్స్ మరీ ఇంత తక్కువా..?

Raja Saab : ప్రభాస్ పరువు తీసిన ‘రాజా సాబ్’.. అక్కడ బుకింగ్స్ మరీ ఇంత తక్కువా..?

Raja Saab : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజా సాబ్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే నెల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గ్రాండ్ గా మొదలు అయ్యాయి. ఈ మూవీ పై హైప్ ను క్రియేట్ చేసేందుకు వరుసగా అప్డేట్స్ ను వదిలేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర యూనిట్.. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇండియాలో మాత్రం ఈ సినిమా కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇక ఇప్పటికే రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. ఇక అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయని ఓ వార్త నెట్టింట వినిపిస్తుంది. అక్కడ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఓవర్సీస్ లో రాజా సాబ్ కు షాక్..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు జనాలు ఎప్పుడెప్పుడు సినిమాని థియేటర్లలో చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.. కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు కానీ.. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజా సాబ్ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ కోసం గత కొన్ని నెలలుగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. థియేటర్లలోకి రావడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అలాగే సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైనట్లు తెలుస్తుంది.. ఇండియా వైడ్ ఓపెనింగ్స్ బాగానే ఉన్నా.. నార్త్ అమెరికాలో మాత్రం దీనికి షాక్ ఎదురైంది.. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి రెండు వారాలు అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 121K డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ మాత్రమే వచ్చింది.. వెయ్యికి పైగా థియేటర్లలో షోలు పడుతున్న నేపథ్యంలో ఇంత తక్కువ బుకింగ్ జరగడంతో అక్కడ ట్రేడ్ పంతులు అయోమయంలో పడ్డారు.. అయితే కల్కి చిత్రం తో మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ ని కేవలం ప్రీమియర్ షోస్ నుండి రాబట్టిన ప్రభాస్ కి, ఇప్పుడు కనీసం 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రావడం కష్టంగా మారింది.. మరి ఈ పరిస్థితి నుంచి ఈ సినిమా గట్టెక్కుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది..

ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు వరుస షాక్ లు..

పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ సినిమాకు మాత్రమే కాదు.. మిగిలిన సినిమాల పరిస్థితి కూడా అక్కడ దారుణంగా మారింది.. గతంలో రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్, ‘హరి హర వీరమల్లు’ ఓజీ సినిమాల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉండడంతో అక్కడ తెలుగు సినిమాలకు వరుసగా షాక్ లు ఎదురవుతున్నాయి. గత కొన్ని నెలలుగా అక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలకు తక్కువ కలెక్షన్స్ రావడంతో పాన్ ఇండియా సినిమాలకు వసూళ్లు భారీగా తగ్గాయని తెలుస్తుంది. మరి ప్రభాస్ రాజా సాబ్ సినిమాకు కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి..

Also Read:మలయాళ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

రాజా సాబ్ మూవీ.. 

ప్రభాస్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.. ఇప్పటికే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూవీ థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ని వదులుతున్నారు. రీసెంట్ గా వచ్చిన డ్యూయెట్ సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ టాక్ థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి..

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×