E-Paper
Advertisement

Mollywood Industry : సినీ ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యం వల్ల ప్రముఖ నటుడు కన్నుమూత..

Mollywood Industry : సినీ ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యం వల్ల ప్రముఖ నటుడు కన్నుమూత..
Advertisement

Mollywood Industry : గత రెండు నెలలు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.. టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటుగా అటు బాలీవుడ్లీ, మాలీవుడ్ లో కూడా ఎంతోమంది ప్రముఖ నటులు మరణించారు. ఇటీవలే నటుడు అఖిల్ విశ్వనాథ్ మరణ వార్తను ఇంకా మర్చిపోలేదు.. ఇప్పుడు మరో నటుడు కన్నుమూశారు.. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆ నటుడు మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు.. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాస్.. మాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.. దాదాపు 225 కు పైగా నటించిన ఈయన ఇప్పుడు లేరు.. ఈ వార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. దిగ్గజ నటుడు చనిపోవడంతో సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.. అలాగే పలువురు సన్నిహితులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తున్నారు.. నేడు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తుంది.. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు నటీనటులు హాజరుకానున్నారని సమాచారం.. దీని గురించి పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

అనారోగ్యం కారణంగానే మృతి.. 

మలయాళ నటుడు, రైటర్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. 1956 లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన ఇక లేరు. ఈ శనివారం తెల్లవారు జామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వయసు పై పడటంతో ఆయనకు గత కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నాడట. ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుముశారు. ఆయన మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. నటుడుగా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు మరుపురానివి.. దర్శకుడుగా కూడా పలు సినిమాలకు పని చేశాడు. కొన్ని రోజుల క్రితమే యువ నటుడు అఖిల్ విశ్వనాథ్ మరణించారు. ఆ ఘటన నుంచి పూర్తిగా తేలిపోక ముందే ఇప్పుడు మరొక నటుడు చనిపోవడం తో దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాస్ నటించిన సినిమాలు..

Advertisement

1956 లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగారు. దాదాపుగా ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటుడుగా సినిమాలు చేశారు… ఎటువంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఆరు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు, నేషనల్ అవార్డు, పలు పురస్కారాలను ఆయన అందుకున్నారు. సందేశం, అజకీయ రవణన్, వరవెల్పు, నడోడికాట్టు, తలయానమంత్రం వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు. అలాగే వడక్కునోక్కియంత్రం, చింతావిష్టయాయ శ్యామల లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయినా తెరకెక్కించిన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.. మలయాళ సినిమాకు శ్రీనివాసన్ అందించిన కృషి అపారమైనది. మలయాళ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన సినిమాలను ప్రేక్షకులు మరోసారి గుర్తు చేసుకున్నారు.. ఇకపోతే శ్రీనివాస్ కు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య పేరు విమల, ఇక ఇద్దరు కుమారులు కూడా ఇండస్ట్రీలో స్టార్ నటులుగా కొనసాగుతున్నారు..

 

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×