E-Paper
Advertisement

Mowgli : మౌగ్లి సినిమాలో పుష్ప రాజ్, ఇదెక్కడి ట్విస్ట్ సందీప్?

Mowgli : మౌగ్లి సినిమాలో పుష్ప రాజ్, ఇదెక్కడి ట్విస్ట్ సందీప్?
Advertisement

Mowgli : ఛాయ్ బిస్కెట్ అని యూట్యూబ్ ఛానల్ తో కెరియర్ స్టార్ట్ చేసిన సందీప్ రాజు కలర్ ఫోటో సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. కరోనా క్రైసిస్ వలన ఆ సినిమా థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటిటి లో విడుదలైంది. అయితే ఆ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా చాలామంది ఆ సినిమా గురించి పోస్టులు పెడుతూ భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. ఆ సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది.

ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సందీప్ రాజ్ ఒక సినిమాకి కూడా దర్శకత్వం వహించలేదు. మొత్తానికి మౌగ్లీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు సందీప్ రాజ్. ఈ సినిమా డిసెంబర్ 13వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ప్రీమియర్ షోలు కూడా మొదలయ్యాయి. అయితే ఇవి కొంతమంది సినిమా ప్రముఖులకు మరియు మీడియాకు మాత్రమే ప్రదర్శించినట్లు తెలుస్తుంది.

పుష్పరాజ్ ఎంట్రీ 

Advertisement

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు అల్లు అర్జున్ కు లభించింది. పుష్ప రాజ్ అనేది కంప్లీట్ ఒక బ్రాండ్ అయిపోయింది.

అయితే దర్శకుడు సందీప్ రాజు సుహాస్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి కలర్ ఫోటో సినిమా చేశారు. అయితే మోగ్లీ సినిమాలో ఒక గెస్ట్ అప్పీరెన్స్ లో కనిపించాడు సుహాస్. ఈ సినిమాలో పుష్పరాజ్ గెటప్ లో కనిపించాడు సుహాస్. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సందీప్ సూపర్ ట్విస్ట్ 

Advertisement

కొన్ని సందర్భాలలో సినిమాలకు సంబంధించి సప్రైజింగ్ విషయాలను కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు బయటకు రాకుండా సినిమాల్లోనే దాచి ఉంచడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సుహాస్ ఒకవైపు హీరోగా మంచి గుర్తింపు సాధించుకుంటూ సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు.

అటువంటి సుహాస్ ఫ్రెండ్షిప్ కొద్దీ ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించిన సంగతి ఎక్కడ న్యూస్ లో కూడా బయటకు రాకుండా హోల్డ్ చేయగలిగారు అంటే పలు జాగ్రత్తలు తీసుకున్నారు అని అర్థం అయిపోతుంది. మరోవైపు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కూడా ఆల్రెడీ మొదలైపోయింది.

Also Read : MSVPG: ఉస్తాద్ ఫస్ట్ సింగిల్ రోజే చిరంజీవి సినిమా ప్రెస్ మీట్, మేటర్ ఏంటంటే?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×