E-Paper
Advertisement

Jacqueline Fernandez: జైలు నుంచి జాక్వెలిన్ కి ఖైదీ ప్రేమలేఖ.. ఏకంగా హెలికాప్టర్ గిఫ్ట్?

Jacqueline Fernandez: జైలు నుంచి జాక్వెలిన్ కి ఖైదీ ప్రేమలేఖ.. ఏకంగా హెలికాప్టర్ గిఫ్ట్?
Advertisement

Jacqueline Fernandez: ప్రేమ అన్న మాటకు అర్థం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కానీ, సుకేశ్ చంద్రశేఖర్ స్టైల్ మాత్రం చాలా కాస్ట్లీ! జైలు గోడల మధ్య ఉన్నా కూడా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మీద తన ‘ప్రేమ’ను చాటుకుంటూనే ఉన్నాడు. 2026 వాలెంటైన్స్ డే సందర్భంగా అతను రాసిన ఒక లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సామాన్యులు రోజా పువ్వులు ఇస్తే, ఈయన గారు ఏకంగా ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్‌నే గిఫ్ట్‌గా ఇస్తానంటున్నాడు. వివరాలలోకి వెళితే ..

జైలు నుండి జెట్ స్పీడ్‌లో ప్రేమలేఖ.. హెలికాప్టర్ గిఫ్ట్:

మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్, జాక్వెలిన్‌ను “మై బేబీ బొమ్మ” అని సంబోధిస్తూ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ఈ ప్రేమికుల రోజున ఆమె కోసం ‘ఎయిర్‌బస్ H-సిరీస్ హెలికాప్టర్‌’ను బహుమతిగా ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. విచిత్రం ఏంటంటే, ఆ హెలికాప్టర్ మీద ఆమె పేరులోని మొదటి అక్షరాలు (JF) కూడా ఉండబోతున్నాయట. తన వల్ల ఆమె ఎదుర్కొన్న చట్టపరమైన ఇబ్బందులకు క్షమాపణలు కోరుతూ, తామిద్దరం ఆధునిక కాలపు “రోమియో-జూలియట్లు” అని అతను తనను తాను ఊహించుకుంటూ లేఖ రాసాడు.ఇక ఇప్పుడు జైలులో ఉండి కూడా ఇన్ని వందల కోట్ల బహుమతుల గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

లగ్జరీ గిఫ్టుల వెనుక మనీలాండరింగ్ నీడ:

Advertisement

సుకేశ్ ఇలాంటి భారీ బహుమతులు ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమెకు బేవర్లీ హిల్స్‌లో బంగ్లా, ప్రైవేట్ జెట్, ఖరీదైన బ్యాగులు, వజ్రాల నగలు ఇచ్చాడని 200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే జాక్వెలిన్ మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్‌గా ఉంది. ఇక జాక్వెలిన్ అతను తనను మానసికంగా వేధిస్తున్నాడని, జైలు అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. సుకేశ్ రాసే ఈ ప్రేమలేఖలు ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయనే చెప్పాలి.

ALSO READ:Vijay varma: వాలెంటైన్స్ డే నాడు తమన్నాకు ఊహించని షాక్.. మరో అమ్మాయితో విజయ్!

జాక్వెలిన్ స్టాండ్: నాకు ఏ సంబంధం లేదు:

Advertisement

సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి వరుసగా ప్రేమలేఖలు రాస్తూ, వందల కోట్ల బహుమతులు ప్రకటిస్తున్నా, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వైఖరి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అతనితో తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధం లేదని, అతను చెబుతున్న ఈ భారీ బహుమతుల గురించి తనకు అసలు సమాచారమే లేదని ఆమె ఇప్పటికే పలుమార్లు కోర్టుకు విన్నవించుకుంది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ మరియు భారీ మోసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్, తన పేరును వాడుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారల పేర్లు బయటకు వచ్చినప్పటికీ, సుకేశ్ పంపిస్తున్న ఈ ‘ప్రేమ లేఖలు’ జాక్వెలిన్‌ను చట్టపరంగా మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అందుకే ఆమె ఈ వ్యవహారానికి దూరంగా ఉంటూ, కేవలం చట్టంపైనే తన నమ్మకాన్ని ఉంచుతోంది.

Related News

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

Big Stories

Advertisement
×