Vijay varma:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది తమన్నా (Tamannaah).. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానులకు చేరువవుతోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు పలు యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది.. ఇదిలా ఉండగా ఇటీవల వరుస సినిమాలతో వార్తల్లో నిలిచే ఈమె మొన్నటికి మొన్న కర్ణాటక మైసూర్ శాండిల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వెనుక అటు కన్నడిగుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక దీంతో తమన్నాను ఎంపిక చేయడం వెనుక అసలు కారణాన్ని కర్ణాటక మినిస్టర్ పాటిల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఈ వివాదం నుంచి బయటపడే లోపే తమన్నాకు ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ భారీ షాక్ ఇచ్చారని చెప్పాలి. 2024 న్యూ ఇయర్ సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని తమన్నా బయట పెట్టింది.ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma)డేటింగ్ లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది కూడా.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ వీరిద్దరూ విడిపోయారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విజయ్ వర్మ వాలెంటైన్స్ డే సందర్భంగా చేసిన ఒక పోస్ట్ నిజంగానే వీరిద్దరూ విడిపోయారనే వార్తలను నిజం చేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే వాలెంటైన్స్ డే సందర్భంగా విజయ్ వర్మ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక గుర్తు తెలియని యువతితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..” ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఫరెవర్” అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో తమన్నా బంధానికి ముగింపు పలికి విజయ్ కొత్త ప్రయాణం మొదలు పెట్టాడని.. నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఆ ఫోటో విజయ్ వర్మ పెట్టిన క్షణాల్లోనే వైరల్ అవ్వడంతో మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిజంగానే వీరిద్దరూ విడిపోయారా ? అందుకే విజయ్ వర్మ ఇలాంటి పోస్ట్ పెట్టారా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ:Chatha Pacha OTT: విడుదలైన వారంలోపే ఓటీటీలోకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇదిలా ఉండగా ఇక్కడ ఈ వార్తల్లో మరో మాట కూడా వినిపిస్తోంది. విజయ్ వర్మ ఆ ఫోటోని ట్యాగ్ చేసిన అకౌంటు ఒరిజినల్ కాదని.. అది ఎదో ఫ్రాన్స్ లేదా బ్రాండ్ ప్రమోషన్ అయి ఉంటుందని మరి కొంతమంది వాదిస్తున్నారు. మొత్తానికైతే మొదట సీరియస్గా తీసుకున్న నెటిజన్ లు ఆ అకౌంట్ డీటెయిల్స్ చూశాక ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా విజయ్ వర్మ , తమన్నా బంధం పై వస్తున్న ఈ పుకార్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. మరి ఎప్పుడు ఈ జంట ఈ రూమర్లపై స్పందించి క్లారిటీ ఇస్తారో చూడాలి.