E-Paper
Advertisement

Ram pothineni: రామ్ పోతినేని ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? తెలుగులో ఎవరు నచ్చలేదా?

Ram pothineni: రామ్ పోతినేని ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? తెలుగులో ఎవరు నచ్చలేదా?
Advertisement

Ram pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) త్వరలో ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రామ్ పోతినేని తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ తనకిష్టమైన హీరో గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రజనీకాంత్ అంటే అంత ఇష్టమా..

సాధారణంగా ప్రతి ఒక్కరికి అభిమాన హీరో హీరోయిన్ ఉంటారు అలాగే రామ్ పోతినేని కూడా తన అభిమాన హీరో గురించి వెల్లడించారు. తనకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) అంటే చాలా ఇష్టమని రామ్ తెలిపారు. రజనీకాంత్ గారు నటించే కమర్షియల్ సినిమాలలో కూడా ఓ ఫిలాసఫీ ఉంటుందని ఆయన సినిమాలన్న, అతని నటన అన్న నాకు చాలా ఇష్టం అంటూ ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్లలో భాగంగా వెల్లడించారు. ఇలా రాం పోతినేనికి రజనీకాంత్ అంటే ఇష్టమని తెలియడంతో రజనీకాంత్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ పలువురు టాలీవుడ్ ప్రేక్షకుల మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న హీరోలు ఉన్నారు వాళ్ళు ఎవరు ఇష్టం లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

సరికొత్త జానర్ లో ఆంధ్ర కింగ్ తాలూకా..

ఇక రజనీకాంత్ గారికి తమిళంలో ఏ స్థాయిలో అయితే ఆదరణ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా రజనీకాంత్ ని తమ ఆరాధ్య దైవంగాను అభిమాన హీరోగా భావిస్తూ ఉంటారు. ఇక రామ్ సినిమా విషయానికి వస్తే ఆంధ్ర కింగ్ తాలూకా ఒక అభిమాని నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పాలి. సరికొత్త జానర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఆంధ్ర కింగ్ గా స్టార్ హీరో?

దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ పోతినేని భాగ్యశ్రీ(Bhagya Shri) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన ప్రమోషన్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాతో రామ్ హిట్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) కీలకపాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఆంధ్ర కింగ్ పాత్రలో మరొక స్టార్ కూడా కనిపించబోతున్నట్లు వెల్లడించారు. మరి ఆంధ్ర కింగ్ గా ఈ సినిమాలో కనిపించబోతున్న ఆ స్టార్ హీరో ఎవరు? ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇటీవల రామ్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఈయన చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నారు.

Also Read: Pushpa 3: పుష్ప ర్యాంపేజ్ షూటింగ్ అప్డేట్..ఇక రప్పా రప్పానే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×