E-Paper
Advertisement

Pushpa 3: పుష్ప ర్యాంపేజ్ షూటింగ్ అప్డేట్..ఇక రప్పా రప్పానే!

Pushpa 3: పుష్ప ర్యాంపేజ్ షూటింగ్ అప్డేట్..ఇక రప్పా రప్పానే!
Advertisement

Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను కాబట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇలా పుష్ప 2 మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో పుష్ప 3(Pushpa 3) సినిమాపై కూడా అంతకుమించి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కాస్త ఆలస్యమవుతుందని చెప్పాలి.

పుష్ప 3 అప్డేట్ ఇచ్చిన మైత్రి రవి..

ఈ క్రమంలోనే అభిమానులు మాత్రం పుష్ప 3 గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోరుతూ ఉంటారు తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవి (Mythri Ravi)ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈయన తన తదుపరి సినిమాల అప్డేట్స్ తెలియజేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు.. ఈ క్రమంలోనే పుష్ప 3 షూటింగ్ గురించి కీలక సమాచారాన్ని తెలియజేశారు.. పుష్ప 3 సినిమా 2027లో షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

చరణ్ సినిమా పనులలో బిజీగా సుకుమార్..

Advertisement

ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమాని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan) బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా (Peddi Movie)పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత సుకుమార్ పుష్ప 3 పనులు మొదలు పెడతారని రవి వెల్లడించారు. ఇక 2026లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభించుకుంటే 27 చివరి కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా 2027 చివరిన పుష్ప 3 సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది.

అట్లీ సినిమా తరువాతనే పుష్ప 3..

Advertisement

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా దర్శకుడు అట్లీ డైరెక్షన్లో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.. ఇక ఈ సినిమా కూడా 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా పనులను పూర్తి చేసిన అనంతరం అల్లు అర్జున్ తిరిగి పుష్ప 3 పనులలో బిజీ కానున్నారు. ఈ విధంగా అల్లు అర్జున్ పుష్ప ర్యాంపేజి గురించి నిర్మాత అప్డేట్ వెల్లడించడంతో అభిమానులకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Allu Arha: తండ్రికి తగ్గ తనయ.. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న అల్లు అర్హ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×