E-Paper
Advertisement

Supritha: సురేఖ వాణి రెండో పెళ్లి పై సుప్రీత కామెంట్స్… తప్పుగా అర్థం చేసుకున్నారా?

Supritha: సురేఖ వాణి రెండో పెళ్లి పై సుప్రీత కామెంట్స్… తప్పుగా అర్థం చేసుకున్నారా?
Advertisement

Supritha: సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఒకానొక సమయంలో ఏదైనా సినిమాలో అక్క వదిన లేదా పిన్ని పాత్రలు ఉన్నాయి అంటే టక్కున సురేఖ వాణి గుర్తుకు వచ్చేవారు . ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ సినిమాలలో నటించి సురేఖ వాణి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే తన భర్త సురేష్ తేజ మరణించిన తర్వాత ఈమె సినిమాలను కూడా పూర్తిగా తగ్గించారని చెప్పాలి .ఇటీవల కాలంలో సురేఖవాణి (Surekha Vani)సినిమాలకు దూరమయ్యారు అయితే అవకాశాలు లేక దూరమయ్యారా లేకపోతే ఈమె ఇండస్ట్రీకి దూరం ఉన్నారా అనే విషయాల పట్ల క్లారిటీ లేదు కానీ సురేఖ వాణి మాత్రం పూర్తిగా సినిమాలను తగ్గించారు.

అమ్మకు పెళ్లి చేయాలనేది నా ఆలోచన..

ఇకపోతే కరోనా సమయంలో తన భర్త అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే. తన భర్త మరణం తర్వాత సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఈమె పెళ్లి గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈమె సింగిల్గానే ఉన్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత తన తల్లి రెండు పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో నన్ను ప్రశ్నిస్తూ అమ్మకు పెళ్లి చేసే ఆలోచన ఉందా అని అడిగారు దాంతో అవునని చెప్పాను.

అమ్మకు పెళ్లి ఆలోచన లేదు..

Advertisement

ఈ విషయాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుని సురేఖవాణి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం చేశారు కానీ నిజం కాదని తెలిపారు. నేను జీవితంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయిన తర్వాత అమ్మ ఒంటరిగా ఉండిపోతుంది అందుకే తనకు పెళ్లి చేయాలని నేను భావించాను కానీ అమ్మకు మాత్రం రెండో పెళ్లి గురించి ఆలోచన లేదని సుప్రీత ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇలా సురేఖ వాణి రెండో పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ సుప్రీత మాత్రం ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన అమ్మకు అలాంటి ఉద్దేశం లేదని తెలిపారు.

హీరోయిన్గా సుప్రీత..

Advertisement

ఇక ప్రస్తుతం సురేఖ వాణి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తన కుమార్తె సుప్రీతను మాత్రం ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేశారు
ఇప్పటికే ఈమె అమరావతికి ఆహ్వానం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరో తమిళ సినిమాతో పాటు తెలుగులో మరొక సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే .ఈ సినిమా కూడా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా తల్లి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సుప్రీత కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టారు. మరి హీరోయిన్ గా సుప్రీత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Supritha: నేను చేసింది తప్పే.. ఇకపై ఆ తప్పులు జరగవు పశ్చాత్తాపడుతున్న సుప్రీత..

Related News

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

Big Stories

Advertisement
×